సర్ మొదలు
ABN , Publish Date - Jun 16 , 2026 | 01:02 AM
జిల్లాలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం ప్రారంభమైంది. ఏడు నియోజకవర్గాలోని 1,714 పోలింగ్ కేంద్రాల వారీగా బీఎల్‌వోలు ప్రజల్లోకి కదిలారు.
ఇంటింటికీ బీఎల్‌వోలు
అనుసరించిన రాజకీయ పార్టీలు
ఏలూరు,జూన్ 15(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం ప్రారంభమైంది. ఏడు నియోజకవర్గాలోని 1,714 పోలింగ్ కేంద్రాల వారీగా బీఎల్‌వోలు ప్రజల్లోకి కదిలారు. సోమవారం ఉదయం నుంచి బూత్ లెవెల్ అఽధికారులు తమ పరిధిలోని ఓటర్ల జాబితాలతో మ్యాపింగ్ ఆధా రంగా ఓటర్లను ప్రత్యక్షంగా కలుసుకున్నారు. సర్ కార్యక్రమం ఉద్దేశ్యాన్ని వారికి కూలకషంగా వివ రిస్తూ సాగారు. ప్రధాన ఎన్యుమరేషన్ పత్రాలు ఇచ్చి వాటి వివరాలను సరిచూసుకుని ఫొటోలు ఇవ్వాల్సిందిగా కోరారు. ప్రభుత్వం ఇచ్చిన కిట్‌లతో ప్రజ ల ముందుకు వెళ్లిన వారితో పాటు పలు రాజకీయ పక్షాల ప్రతినిధు లు సర్ కార్యక్రమం మొదటి రోజు ఏ విధంగా సాగిందో ఆరా తీయడం విశేషం. ఈసారి ఓటును సరిచూసుకోకపోతే తొలగిపోతా యని వివరిస్తున్నారు. చనిపోయిన ఓటర్ల తొలగింపునకు వారి వివ రాలను ఆరా తీయడం కనిపించింది. 2002 ఓటర్ల జాబితాలతో ప్రస్తు త ఓటర్ల జాబితాలను సరిపోల్చుతున్నారు. ఎన్యుమరేషన్ ఫారాలను నింపి సిద్ధంగా ఉంచితే తామే వచ్చి మళ్లీ తీసుకుంటామని బీఎల్‌వో లు వివరిస్తున్నారు. మొత్తం మీద తొలిరోజు సందడిగానే ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం సాగింది.