గోపన్నపాలెం కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు
ABN , Publish Date - Jan 06 , 2026 | 12:47 AM
‘గ్రామస్తులు పాల్గొనకుండా గ్రామ సభలా..?,అసలు పంచాయతీ కార్యదర్శి ఎక్కడ..? విధుల్లో అలసత్వం వహిస్తే సహిం చేది లేదు.. పంచాయతీ కార్యదర్శులు బాధ్యతగా విధులు నిర్వహించాలి’ అంటూ గోపన్నపాలెం పంచాయతీ కార్యదర్శిపై డీపీవో కొడాలి అనురాధ అగ్రహం వ్యక్తం చేశారు.
దెందులూరు,జనవరి 5 (ఆంధ్రజ్యోతి) : ‘గ్రామస్తులు పాల్గొనకుండా గ్రామ సభలా..?,అసలు పంచాయతీ కార్యదర్శి ఎక్కడ..? విధుల్లో అలసత్వం వహిస్తే సహిం చేది లేదు.. పంచాయతీ కార్యదర్శులు బాధ్యతగా విధులు నిర్వహించాలి’ అంటూ గోపన్నపాలెం పంచాయతీ కార్యదర్శిపై డీపీవో కొడాలి అనురాధ అగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక పంచాయతీ కార్యా లయం వద్ద సోమవారం వికసిత భారత్ జీ రామ్ జీ గ్రామసభ జరిగింది. అధికారులు మినహా గ్రామస్తులు రాకపోవడం తో డీపీవో గ్రేడ్–5 పంచాయతీ కార్యదర్శి విజయ్ కుమార్‌ను గ్రేడ్–3 పంచాయతీ కార్యదర్శి స్టానిష్‌బాబు ఎక్కడకు వెళ్లారని ప్రశ్నించారు. కోర్టు పని మీద వెళ్లారని ఆయన తెలిపారు. దీనిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నతాధికారుల అనుమతి తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవరించడంపై స్టానిష్‌బాబుకు, గ్రామ సభ నిర్వహణపై గ్రామ స్తులకు సమాచారం ఇవ్వని విజయ్‌కుమార్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నట్టు తెలిపారు. కార్య క్రమంలో మాజీ సర్పంచ్ మాగంటి నారాయణ ప్రసాద్, గ్రామ టీడీపీ అధ్యక్షుడు చింత సుబ్బారావు, మారగాని సత్యనారాయణ, కేబుల్ శ్రీను,నీటి సంఘం అధ్యక్షుడు చమ్మళ్ళ మూడి రాము కొండేటి శ్రీను,బొర్రా చందు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.