Share News

నేడు జిల్లాలో షర్మిల పర్యటన

ABN , Publish Date - Mar 07 , 2026 | 12:32 AM

ఉపాధి హామీ పరిరక్షణ రాష్ట్ర యాత్రలో భాగంగా ఏపీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్‌.షర్మిలరెడ్డి శనివారం జిల్లాలో పర్యటించనున్నట్టు జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాజనాల రామ్మోహన్‌రావు తెలిపారు.

నేడు జిల్లాలో షర్మిల పర్యటన
భీమడోలులో సభా వేదిక ప్రాంతాన్ని పరిశీలిస్తున్న జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాజనాల రామ్మోహనరావు

ఏలూరు కార్పొరేషన్‌/భీమడోలు, మార్చి 6 (ఆంధ్రజ్యోతి) : ఉపాధి హామీ పరిరక్షణ రాష్ట్ర యాత్రలో భాగంగా ఏపీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్‌.షర్మిలరెడ్డి శనివారం జిల్లాలో పర్యటించనున్నట్టు జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాజనాల రామ్మోహన్‌రావు తెలిపారు. జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయం వద్ద శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శనివారం ఉదయం 10 గంటలకు భీమడోలు గాంధీబొమ్మ సెంటర్‌లో ఉపాధి హామీ కూలీలతో షర్మిలరెడ్డి ముఖాముఖి నిర్వహించి ఈ పథకానికి గాంధీ మహాత్ముడి పేరును తొలగించడం, పని హక్కు అవసరం గురించి ప్రజలతో మాట్లాడతార న్నారు. చింతలపూడి నియోజకవర్గంలో ఎర్రపాలెంలో వైఎస్సార్‌ విగ్రహం వద్ద సాయంత్రం 4 గంటలకు షర్మిలరెడ్డి రచ్చబండ నిర్వహిస్తారన్నారు. సమావేశంలో సిటీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ప్రతాప సుబ్రహ్మణ్యశర్మ, కాంగ్రెస్‌ నాయకులు దండుబోయిన చంద్రశేఖర్‌, సేవాదళ్‌ సుబ్బారావు, కె.ఎస్‌.ఎన్‌.మూర్తి, వెంకన్న, భూషణం, కుమార్‌ ఉన్నారు. కాగా రామ్మోహనరావుతో పాటు కో ఆర్డినేటర్‌ పెద్దిరెడ్డి సుబ్బారావు, యర్రంశెట్టి ఏడుకొండలు, విజయ్‌ అచ్యుత్‌, సాయి నాగబాబు, మూర్తి, నజీర్‌ తదితర నేతలు భీమడోలులో సభా వేదిక ఏర్పాట్లను పరిశీలించారు. కాగా ఈనెల 9న వైఎస్‌ షర్మిలరెడ్డి పశ్చిమగోదావరి జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొనున్నారు.

Updated Date - Mar 07 , 2026 | 12:32 AM