Share News

ఉపాధిపై బీజేపీ కుట్రలు

ABN , Publish Date - Mar 08 , 2026 | 01:17 AM

‘ఉపాధి హామీ పథకం వైఎస్సార్‌ ఆశయాల నుంచి పుట్టింది. దీనివల్ల గ్రామాల్లో కరువు, వలసలు తగ్గాయి.. పేదల కడుపు నింపే ఉపాధిపై బీజేపీ కుట్రలు చేస్తోంది. కొత్తగా వీబీజీ రాం జీ చట్టం తెచ్చి ఉపాధి లేకుండా చేస్తున్నారు. తండ్రి ఆశయాల నుంచి పుట్టిన ఈ పథకాన్ని కాపాడాలన్న చిత్తశుద్ధి వై.ఎస్‌.జగన్‌కు లేదు. ఈ చట్టాన్ని మోదీ తెచ్చి అన్యాయం చేస్తుంటే జగన్‌ మౌనంగా ఉన్నారు..’ అంటూ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలరెడ్డి ధ్వజమెత్తారు.

ఉపాధిపై బీజేపీ కుట్రలు
భీమడోలు సభలో ప్రసంగిస్తున్న వైఎస్‌ షర్మిల

వైఎస్సార్‌ ఆశయాల నుంచి పుట్టిన పథకమిది..

కాపాడాలన్న చిత్తశుద్ధి జగన్‌కు లేదు..

హామీలను మరిచిన చంద్రబాబు

కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల

ఎర్రంపల్లి, భీమడోలులో ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర

చింతలపూడి/భీమడోలు, మార్చి 7(ఆంధ్రజ్యోతి): ‘ఉపాధి హామీ పథకం వైఎస్సార్‌ ఆశయాల నుంచి పుట్టింది. దీనివల్ల గ్రామాల్లో కరువు, వలసలు తగ్గాయి.. పేదల కడుపు నింపే ఉపాధిపై బీజేపీ కుట్రలు చేస్తోంది. కొత్తగా వీబీజీ రాం జీ చట్టం తెచ్చి ఉపాధి లేకుండా చేస్తున్నారు. తండ్రి ఆశయాల నుంచి పుట్టిన ఈ పథకాన్ని కాపాడాలన్న చిత్తశుద్ధి వై.ఎస్‌.జగన్‌కు లేదు. ఈ చట్టాన్ని మోదీ తెచ్చి అన్యాయం చేస్తుంటే జగన్‌ మౌనంగా ఉన్నారు..’ అంటూ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలరెడ్డి ధ్వజమెత్తారు. చింతలపూడి మండలం ఎర్రంపల్లిలో, భీమడోలు గాంధీబొమ్మ సెంటర్‌లో శనివారం ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా రచ్చబండ సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘చంద్రబాబు రాష్ట్రంలో ఇచ్చిన ఏ హామీని అమలు చేయడం లేదు. గ్రామాల్లో జరిగే ఉపాధి పనులను ఢిల్లీ నుంచే నిర్ణయిస్తారు.. గ్రామాల్లో ఉండే అవసరాలు కేంద్ర పెద్దలకు ఎలా తెలు స్తాయి..?. 125 రోజుల పని బూటకం. రాష్ట్రంపై ఈ చట్టంతో రూ.ఐదు వేల కోట్ల భారం పడుతుంది. భారం పడే చట్టంపై టీడీపీ ఎందుకు మద్దతు ఇస్తోంది. రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్‌ మళ్లీ అధికారంలోకి రావాలి’ అంటూ పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో రచ్చబండలో పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేడీ సెల్వమ్‌, జిల్లా పార్టీ అధ్యక్షుడు రాజనాల రామ్మోహనరావు, చింతలపూడి నియోజకవర్గ ఇన్‌చార్జి ఉన్నమట్ల ఎలీజా, ఉంగుటూరు కో ఆర్డినేటర్‌ పెద్దిరెడ్డి సుబ్బారావు, మండల పార్టీ అధ్యక్షుడు ఏడు కొండలు, పీసీసీ ప్రధాన కార్యదర్శి సత్యేంద్రబాబు, డీసీసీ ప్రధాన కార్యదర్శి విజయ్‌ అచ్యుత్‌ పాల్గొన్నారు. కాగా భీమడోలులో బీజేపీ పార్టీ మండల కార్యదర్శి గౌరీ శంకర్‌ కాంగ్రెస్‌లో చేరగా షర్మిల కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Updated Date - Mar 08 , 2026 | 01:17 AM