బంగారం కొందామా..!
ABN , Publish Date - Jul 28 , 2026 | 01:06 AM
బంగారం ధరలు దోబూచులాడుతున్నాయి. పది రోజులుగా తగ్గినట్లే తగ్గి, మళ్లీ పెరుగుతోంది.
మార్కెట్‌లో సందడి
నరసాపురం, జూలై 27(ఆంధ్రజ్యోతి): బంగారం ధరలు దోబూచులాడుతున్నాయి. పది రోజులుగా తగ్గినట్లే తగ్గి, మళ్లీ పెరుగుతోంది. వచ్చే నెల శ్రావణమాసం కావడంతో పెళ్లిళ్లు, ఇతర శుభ కార్యక్రమాలకు ముహూర్తాలు పెట్టుకున్న వారంతా ఆభరణాల తయారీకి ఆర్డర్లు ఇస్తున్నారు. ఈ కారణంగా చాలా దుకాణాల్లో కొనుగోళ్ల సందడి నెలకొంది. ఇటీవల ‘తల్లికి వందనం’ పథకం డబ్బులను ప్రభుత్వం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసింది. ఈ ప్రభావం కూడా మార్కెట్‌లో కనిపిస్తోంది. చాలా మంది చిన్న చిన్న వస్తువులు కొనుగోలు చేస్తుండడంతో వ్యాపారం మళ్లీ పుంజుకుంది. గత వారంతో పోలిస్తే ధర గ్రాముకు రూ.100 పెరిగింది. ఆర్నమెంట్ బంగారం గ్రాము రూ. 13,250, బిస్కెట్ బంగారం రూ.14,400 ఉంది. గత వారంలో గ్రాము బంగారం రూ.12,800కు ఆర్నమెంట్ తగ్గింది. మరింత తగ్గుతుందని విని యోగదారులు అంచనా వేసినప్పటికి అంతర్జాతీ య పరిణామాల నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ పెరుగుదల, పసిడిపై పెట్టుబడులు పెరగడంతో ధర పుంజుకుంది. బుధవారం ఫెండ్ మీటింగ్‌లో తీసుకునే వడ్డీ రేట్ల నిర్ణయం కీలకంగా మార నుంది. మరోవైపు కొనుగోళ్లు పెరగడంతో జ్యువె లరీ షాపులు కళకళలాడుతున్నాయి. సోమవారం నరసాపురం బులియన్ మార్కెట్ వీధి కిటకిట లాడింది. భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు మార్కెట్లలోను పసిడి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. మరోవైపు సిల్వర్ ధర గత వారం కేజీ రూ.2.20 లక్షలకు దిగినప్పటికి సోమవారం కేజీ రూ.2.32 లక్షలకు పెరిగింది.
పోస్టాఫీస్‌లు, బ్యాంకులకు క్యూ
తాడేపల్లిగూడెం, జూలై 27(ఆంధ్ర జ్యోతి): తమ ఖాతాల్లో పడిన ‘తల్లికి వందనం’ పథకం డబ్బులు తీసుకునేందుకు పోస్టాఫీస్, బ్యాంకు లు మహిళలతో సోమవారం కిటకిటలాడాయి. విద్యార్థి తల్లి పేరుతో ఆధార్‌కు అనుసంధాన మైన యాక్టివ్ బ్యాంక్, పోస్టాఫీస్ ఖాతాలకు ఈ డబ్బులు జమ కావడంతో వీటిని తీసుకు నేందుకు క్యూ కడుతున్నారు. జూలై 22 నుంచి 24 మధ్య దశల వారీగా జమయ్యాయి. శని, ఆదివారాలు బ్యాంకులకు సెలవు కావడంతో సోమవారం కిక్కిరిసాయి. ఈ సొమ్ముతో కొంద రు పిల్లల ఫీజులు చెల్లించగా, మరికొందరు బంగారు ఆభరణాలు, గృహోపకరణాలు కొను గోలు చేస్తున్నారు.