Share News

కష్టపడి ఉన్నత లక్ష్యాలను సాధించాలి

ABN , Publish Date - Jul 21 , 2026 | 12:54 AM

విద్యార్థుల చదువు ఇటు రాష్ట్రానికి, అటు దేశానికి ఆర్థికశక్తిగా నిలవాలని, ఇది నిరంతరం కష్టపడి ఉన్నత లక్ష్యా లను సాధించినప్పుడే సాధ్యమని కలెక్టర్‌ వెట్రిసెల్వి విద్యార్థులకు పిలుపునిచ్చారు.

కష్టపడి ఉన్నత లక్ష్యాలను సాధించాలి
విద్యార్థి కావ్యకు సర్టిఫికేట్‌ అందజేస్తున్న ఎమ్మెల్యే చంటి, కలెక్టర్‌ వెట్రిసెల్వి

కలెక్టర్‌ వెట్రిసెల్వి.. 222 మంది షైనింగ్‌ స్టార్స్‌కు రూ.37.47 లక్షలు, మెడల్స్‌ అందజేత

పెదపాడు, జూలై 20 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల చదువు ఇటు రాష్ట్రానికి, అటు దేశానికి ఆర్థికశక్తిగా నిలవాలని, ఇది నిరంతరం కష్టపడి ఉన్నత లక్ష్యా లను సాధించినప్పుడే సాధ్యమని కలెక్టర్‌ వెట్రిసెల్వి విద్యార్థులకు పిలుపునిచ్చారు. 10వ తరగతి, ఇంట ర్మీడియట్‌లో ఉత్తమ ఫలితాలు సాధించి షైనింగ్‌ స్టార్స్‌గా ఎంపికైన 222 మంది విద్యార్థులకు రూ.37.47 లక్షల నగదు బహుమతులు, ప్రశంసా పత్రాల పంపిణీ కార్యక్రమం వట్లూరులోని సర్‌ సీఆర్‌రెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాలలో సోమవారం జరిగింది. ఏలూరు, దెందులూరు ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య (చంటి), చింతమనేని ప్రభాకర్‌లతో కలిసి కలెక్టర్‌ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ విద్యారంగంలో ఆదర్శవంతమైన జిల్లాగా నిలిచేలా సమష్టిగా కృషి చేద్దామన్నారు. ఎమ్మెల్యే లు చంటి, చింతమనేని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్య, వైద్యరంగానికి ఎంతో ప్రాధాన్యత నిస్తోంద న్నారు. గత ప్రభుత్వం విద్యావ్యవస్థను సర్వనాశనం చేసిందన్నారు. అనంతరం షైనింగ్‌ స్టార్స్‌గా ఎంపి కైన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, మెడల్స్‌ను అందజేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి కలెక్టర్‌ భోజనం చేశారు. డీఈవో వెంకటలక్ష్మమ్మ, డీఐవో యోహాను, పరీక్షలు నిర్వ హణ సహాయ కమిషనర్‌ ఆర్‌.ఆశ, తహసీల్దారు కృష్ణజ్యోతి, ఎంఈవోలు అరుణ్‌కుమార్‌, నరసింహా మూర్తి, హెచ్‌ఎంల సంఘం అధ్యక్షుడు వడ్లపట్ల మురళీకృష్ణ, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Updated Date - Jul 21 , 2026 | 12:54 AM