ఎస్జీఎఫ్ క్రీడా పోటీల్లో ఉమ్మడి పశ్చిమ జిల్లా క్రీడాకారుల ప్రతిభ
ABN , Publish Date - Sep 30 , 2026 | 12:14 AM
ఇటీవల ఏలూరు ఇండోర్ స్టేడియంలో జరిగిన జిల్లాస్థాయి నేషనల్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్)లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల క్రీడాకా రులు పలు విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
‘రెజ్లింగ్, జూడో’ల్లో శనివారపుపేట విద్యార్థుల సత్తా
ఏలూరురూరల్/కామవరపుకోట/ఉండి, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): ఇటీవల ఏలూరు ఇండోర్ స్టేడియంలో జరిగిన జిల్లాస్థాయి నేషనల్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్)లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల క్రీడాకా రులు పలు విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. రెజ్లింగ్, జూడో పోటీల్లో శనివా రపుపేట జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. బాలికల విభాగంలో ఎం.దివ్య, ఎస్‌కే ఆఫ్రిన్, ఆర్.సాహిత్య, ఎస్.మాధురి, డి.సన్నిధి, సీహెచ్ స్నేహప్రియ ఎంపికయ్యారు. బాలుర విభాగంలో ఎం. మణిరాజ్ కుమార్, ఎం.మనోహర్‌స్వాద్, పి.శరత్, ఎం.రితీష్ కుమార్, కార్తీక్, బి.హేమంత్‌కుమార్, కె.మైకేల్, పి.జస్వంత్ కుమార్, కె. శ్రీనివాస్‌కళ్యాణ్, సీహెచ్ హరీష్ ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులను పాఠశాల హెచ్‌ఎం ఫ్రాన్సినా, పీడీ పద్మలత, ఉపాధ్యా యులు వెంకన్న, అన్నపూర్ణ తదితరులు మంగళవారం అభినందించారు.
కామవరపుకోట మండలం ఆడమిల్లి జడ్పీ హైస్కూలుకు చెందిన ఏడుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికయ్యా రని హెచ్‌ఎం ఘంటా రవిచంద్రమోహన్, మానుకొండ సుబ్బారావు తెలిపారు. అండర్–14 విభాగంలో జి.పావని, బి.అక్షయ, బి.భూమిక, బి.కుమారి, వి.రాజాచంద్రకాంత్, అండర్–17లో కె.పూజిత, వి.అక్షరలు రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికైనట్టు వారు తెలిపారు.
రాష్ట్రస్థాయి కరాటే పోటీలకు ఉండి జడ్పీ హైస్కూల్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులు పి.గీతిక, బి.మహేష్, ఈ.మహేంద్ర ఎంపిక య్యారని హెచ్‌ఎం వై.రామలక్ష్మి, పీడీ శ్రీనివాస్ తెలిపారు. అండర్–17 బాలబాలికల హ్యాండ్ బాల్ పోటీలకు ఎన్‌ఆర్‌పీ అగ్రహారం జడ్పీ హైస్కూలులో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు పి.చంద్రన్న నాయుడు, డి.మనో ఎంపికయ్యారని పాఠశాల హెచ్‌ఎం ఎస్.వెం కటేశ్వరరావు తెలిపారు. క్రీడాకారులను, పీడీ కె.శ్రీనివాసరవుఉను హెచ్‌ఎం, ఉపాధ్యాయులు అభినందించారు.