సర్వీసు రోడ్డుకు మోక్షం
ABN , Publish Date - Oct 04 , 2026 | 11:45 PM
తణుకులోని ఉండ్రాజవరం జంక్షన్‌లో ఫ్లైఓవర్‌కు ఇరువైపులా సర్వీసు రోడ్డు ప్రమాదకరంగా మారింది. ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ చొరవతో ఎట్టకేలకు రహదారి సమస్యకు మోక్షం లభించ నుంది.
తణుకు ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్డు నిర్మాణానికి
రూ.1.74 కోట్లు మంజూరు
టెండర్లు పూర్తి.. త్వరలో నిర్మాణం : ఎమ్మెల్యే ఆరిమిల్లి
తణుకు, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): తణుకులోని ఉండ్రాజవరం జంక్షన్‌లో ఫ్లైఓవర్‌కు ఇరువైపులా సర్వీసు రోడ్డు ప్రమాదకరంగా మారింది. ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ చొరవతో ఎట్టకేలకు రహదారి సమస్యకు మోక్షం లభించ నుంది. రోడ్డు నిర్మాణానికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్ ఏఐ) 1.74కోట్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపా రు. ఆధికారులతో కలసి సర్వీసు రోడ్లను ఆదివారం ఆయన పరిశీలించారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, త్వరలోనే నిర్మాణ పనులు జరుగుతాయన్నారు. జంక్షన్ వద్ద ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు ఏళ్ల తరబడి నిలిచిపోవడంతో ఇరువైపులా సర్వీసు రోడ్లు భారీ గోతులతో అధ్వానంగా మారాయి. గుంతల్లో పడి భారీ వాహనాలు నిలిచిపోతున్నాయి. ఈ సమస్యపై పలుమార్లు అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తానని, స్థానికంగా రోడ్ల దుస్థితిపై హైవే అధికారులను నిలదీసినట్లు ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ కమిషనర్ టి.రామ్‌కుమార్ తదితరలు ఉన్నారు.