వాహనాలకు సర్వర్ బ్రేక్
ABN , Publish Date - Oct 23 , 2026 | 12:17 AM
జిల్లా లోని రవాణా శాఖ ఆన్‌లైన్ సేవలకు సాం కేతిక సమస్యలు అంతరాయం కలిగిస్తున్నా యి. సర్వర్ సరిగా పనిచేయకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు.
రవాణా సేవలకు అంతరాయం.. 45 రోజులుగా నిలిచిన పాత వాహనాల యాజమాన్య బదిలీలు..
కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లలోనూ జాప్యం.. జిల్లాలో అన్ని రవాణా యూనిట్లలో ఇదే పరిస్థితి
తణుకు, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): జిల్లా లోని రవాణా శాఖ ఆన్‌లైన్ సేవలకు సాం కేతిక సమస్యలు అంతరాయం కలిగిస్తున్నా యి. సర్వర్ సరిగా పనిచేయకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. ముఖ్యంగా పాత వాహనాలు యాజ మాన్య బదిలీ ప్రక్రియ గత 45రోజులుగా సజావుగా సాగడం లేదు. కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్‌లోనూ రెండు, మూడు రోజులుగా జాప్యం ఏర్పడంతో కొనుగోలు దారులు, షోరూమ్ నిర్వాహకులకు ఇబ్బందులు తప్పడం లేదు.
బదిలీ ప్రక్రియలో జాప్యం
పాత వాహనాలను కొనుగోలు చేసిన వారు తమ పేరుపై యాజమాన్య హక్కుల ను బదిలీ చేసుకునేందుకు రవాణా శాఖ సర్వర్ ఆన్‌లైన్‌లో 45 రోజులుగా పనిచే యడం లేదు. దీంతో అన్ని పత్రాలు సక్ర మంగా ఉన్నట్లయితే రవాణా శాఖ కార్యాల యంలో చేయాలని ఉన్నతాధికారులు చెప్ప డం జరిగింది. అయితే చాలా మంది ఆన్ లైన్ సర్వర్ పనిచేయడం లేదని ఉద్దేశంతో అనేక దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటున్నా యి. రోజులు తరబడి వేచి చూసినా పనులు పూర్తి కాకపోవడంతో వాహనదారులు
కార్యాలయాలు చుట్టు తిరగాల్సి వస్తుందని చెబుతున్నారు. వాహనం కోనుగోలు చేసిన తర్వాత యాజమాన్య బదిలీ పూర్తికాకపో వడం వల్ల భవిష్యత్‌లో అవసరమైన అధికారిక లావాదీవీలు సమయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నది.
వందల్లో రిజిష్ట్రేషన్లు
జిల్లాలోని తణుకు, తాడేపల్లిగూడెం, పాల కొల్లు, భీమవరం రవాణా కార్యాలయాల్లో ప్రతి రోజు కొత్త వాహనాలు ఆయా కార్యాల యాల పరిధిలో ఆరు వందల వరకు రిజి స్ర్టేషన్లు జరుగుతున్నాయి. పాత వాహనాలు యాజమాన్య హక్కుల మార్పిడి వంటివి మూడు వందల వరకు జరుగుతున్నాయి. దీనికి తోడు కొత్త వాహనాలకు బ్యాంకు రుణాలకు సంబంధించి స్లాట్‌లు కూడా ముందుకు కదలడం లేదు. అలాగే ఎల్.ఎల్. ఆర్‌లు ఆన్‌లైన్‌లో ఇచ్చినప్పటికి అది కూడా సర్వర్ సమస్యలతో ముందుకు సాగడం లేదు.
నాలుగు కార్యాలయాల్లోను సమస్య
జిల్లాలోని తణుకు, తాడేపల్లిడూడెం, భీమవరం, పాలకొల్లు రవాణాశాఖ కార్యాల యాల పరిధిలో నూ ఇదే పరిస్థితి ఉన్నట్లు సమాచారం. సమస్య ఒకటి రెండు కార్యాల యాలకు పరిమితం కాకుండా జిల్లా వ్యాప్త ంగా కనిపించడంతో వాహనదారుల ఇబ్బం దులు పెరిగాయి.
సర్వర్ సమస్య పరిష్కరించాలి
సర్యర్ సమస్యను త్వరగా పరిష్కరించి పాత వాహనాల యాజమాన్య బదిలీలు, కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్లును వేగవంతం చేయాలని వాహనదారులు కోరుతున్నారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిష్కరిం చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆన్‌లైన వ్యవస్థ కీలకంగా మారిన నేపఽథ్యంలో సర్వర్ అంతరాయాలను ప్రజలపై నేరుగా ప్రభావం చూపుతున్నాయి. సాంకేతిక సమస్యలను త్వరగా పరిష్కరిం చడంతో పాటు, పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని వాహనదాలు కోరుతున్నారు. సర్వర్ సమస్య పరిష్కారానికి రాష్ట్రస్థాయిలో చర్యలు తీసుకు ంటున్నట్లు తణుకు ప్రాంతీయ రవాణా అధి కారి శ్రీనివాసరావు చెప్పారు. కొత్త వాహనా లు రిజిష్ట్రేషన్లు విషయంలో షోరూమ్‌లలో అవుతున్నాయన్నారు. సర్వర్ సమస్యలు ఉంటే కేవలం గంటల వ్యవధిలోనే పరిష్కరించడం జరుగుతుందన్నారు.