స్వీయగణన సులభతరం
ABN , Publish Date - Apr 27 , 2026 | 12:24 AM
జనగణనలో భాగంగా స్వయంగా ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయడం సులభతరమని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు.
పాల్గొన్న కలెక్టర్, జేసీ, అధికారులు
ఏలూరు రూరల్, ఏప్రిల్ 26(ఆంధ్రజ్యోతి): జనగణనలో భాగంగా స్వయంగా ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయడం సులభతరమని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. స్వీయ గణనపై అవగాహన కల్పిస్తూ ఏలూరులోని ఇండోర్ స్టేడియం నుంచి ఆదివారం చేపట్టిన 5కే రన్‌ను కలెక్టర్ ప్రారంభించారు. 16వ జనగణనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈనెల 30 వరకు ప్రజలకు స్వీయ గణనకు అవకాశం కల్పించిందన్నారు. 5కె రన్‌లో రోడ్డుపై ఆటో, వాహనదారులను ఆపి, ఆర్టీసీ బస్సులలో ప్రయాణికులను కలిసి స్వీయ గణన గురించి తెలియజేశారు. కార్యక్రమంలో జేసీ ఎం.జె అభిషేక్‌గౌడ, డీఎఫ్‌వో సందీప్‌రెడ్డి, ట్రైనీ కలెక్టర్ శ్రావణ్ కుమార్ రెడ్డి, ఆర్డీవో కిశోర్, మున్సిపల్ కమిషనర్ ఎ.భానుప్రతాప్, డీఎంహెచ్‌వో శోభ, డీఈవో వెంకటలక్ష్మ మ్మ, డీసీహెచ్‌ఎస్ పాల్ సతీష్, తదితరులు పాల్గొన్నారు.