Share News

టిడ్కో కాలనీల్లో జీవనోపాధి కేంద్రాలు

ABN , Publish Date - Aug 27 , 2026 | 12:49 AM

పట్టణాల్లో టిడ్కో కాలనీల్లో నివసిస్తున్న పేదలకు నిత్యావసర వస్తువులు, ఇతర సేవలు అందుబాటులోకి తీసుకురావడంతోపాటు మహిళా సంఘాల సభ్యులకు ఉపాధి కల్పించే దిశగా మెప్మా అధికారులు చర్యలు చేపట్టారు.

టిడ్కో కాలనీల్లో  జీవనోపాధి కేంద్రాలు

లబ్ధిదారుల అవసరాలపై మెప్మా సర్వే

మహిళా సంఘాలకు ఉపాధి..

కాలనీవాసులకు నిత్యావసరాలు, సేవలు

భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు పట్టణాల్లో టిడ్కో కాలనీల్లో నివసిస్తున్న పేదలకు నిత్యావసర వస్తువులు, ఇతర సేవలు అందుబాటులోకి తీసుకురావడంతోపాటు మహిళా సంఘాల సభ్యులకు ఉపాధి కల్పించే దిశగా మెప్మా అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కాలనీల్లో ‘జీవనోపాఽధి కేంద్రాల ఏర్పాటుకు సర్వే’ నిర్వహిస్తున్నారు. కాలనీవాసుల అవసరాలు, స్థానికంగా ఉండే డిమాండ్‌, మహిళా సంఘాల ఆసక్తిని తెలుసుకుని అందుకు అనుగుణంగా వీటిని ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు.

భీమవరం, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): గతంలో ఆయా కాలనీల్లో మినీ బజార్లను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. కొంత స్థలాన్ని కేటా యించడంతోపాటు నిర్మాణ పనులు ప్రారంభించారు. వివిధ కారణాలతో ఇవి ఏర్పాటు చేయలేదు. గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రతిపాదనలు మరుగున పడగా.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టిడ్కో గృహాల నిర్మాణం, లబ్ధిదారులకు ఇళ్ల అప్పగింత ప్రక్రియ వేగం పుంజుకుంది. దీంతో కాలనీల్లో నివాసం ఉంటున్న కుటుంబాల అవసరా లను గుర్తించి, మినీ బజార్లకు ప్రత్యామ్నాయంగా జీవనోపాధుల కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు.

ఎలాంటి దుకాణాలు అవసరం?

టిడ్కో కాలనీల్లో ఇప్పటికే నివాసం ఉంటున్న కుటుంబాలకు అవసరమైన వస్తువులు, సేవలు ఏమిటి? ఎలాంటి దుకాణాలు ఏర్పాటు చేస్తే స్థాని కంగా ఆదరణ ఉంటుంది? మహిళా సంఘాల సభ్యు లు ఏ రంగాల్లో ఉపాధి పొందేందుకు ఆసక్తి చూపుతు న్నారు? వంటి అంశాలను మెప్మా అధికారులు సర్వే ద్వారా తెలుసుకుంటున్నారు. ప్రధానంగా మ్యాను ఫ్యాక్చరింగ్‌, సర్వీస్‌ సెంటర్లనే రెండు విభాగాల్లో సర్వే నిర్వహిస్తున్నారు. టిడ్కో కాలనీల్లో నివసించే కుటుంబాలు నిత్యావసర వస్తువులు, ఇతర సామగ్రి కొనుగోలు కోసం ప్రస్తుతం సమీప పట్టణ ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో సమయం, రవాణా ఖర్చులు పెరుగుతున్నాయి. మహిళలు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా కాల నీల్లోనే అవసరమైన వస్తువులు, సేవలను అందుబాటు లోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు.

తాడేపల్లిగూడెంలో 5,134 ఇళ్లు నిర్మించి లబ్ధిదారుల కు అందజేశారు. భీమవరంలో 8,352 ఇళ్లకు 3,904 నిర్మించి లబ్ధిదారులకు అందజేశారు. పాలకొల్లు లో 6,144 ఇళ్లకు గాను ఇప్పటి వరకు నాలుగు వేలకు పైగా ఇళ్లను నిర్మించారు. లబ్ధిదారులకు అప్పగించే ప్రక్రియ కొనసాగుతోంది. సర్వే పూర్తయిన అనంతరం కాలనీవాసుల అవసరాలు, స్థానికంగా ఉన్న అవకా శాలను విశ్లేషించి మెప్మా అధికారులు ఉన్నతాధికారు లకు నివేదిక అందించనున్నారు. వారి ఆదేశాల మేరకు ఆయా టిడ్కో కాలనీల్లో జీవనోపాధుల కేంద్రాల ఏర్పా టుపై తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నిర్ణయంపై మహిళా సంఘాలు, టిడ్కో ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Aug 27 , 2026 | 12:49 AM