పంటల సంరక్షణకు సీడ్ పెలెటైజేషన్ బాల్స్
ABN , Publish Date - May 21 , 2026 | 12:21 AM
నేలలో తేమశాతం పెరుగుదలకు, చీడపీడల నుంచి పంటల సంరక్షణకు ‘సీడ్ పెలెటైజేషన్ బాల్స్’ ఉపయో గపడతాయని ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ బి.వెంకటేశ్ తెలిపారు.
పెదవేగి, మే 20(ఆంధ్రజ్యోతి): నేలలో తేమశాతం పెరుగుదలకు, చీడపీడల నుంచి పంటల సంరక్షణకు ‘సీడ్ పెలెటైజేషన్ బాల్స్’ ఉపయో గపడతాయని ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ బి.వెంకటేశ్ తెలిపారు. భోగాపురంలో ప్రకృతి వ్యవసాయం రైతు నడిపల్లి రామరాజు పొలంలో మరో ఐదుగురు ప్రకృతి వ్యవసాయ రైతులతో కలిసి గోమయం, మట్టి మిశ్రమంతో బుధవారం సీడ్ పెలెటైజేషన్ బాల్స్‌ను తయారు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీడ్ పెలెటైజేషన్ బాల్స్‌తో పక్షులు, చీమలు వంటి వాటినుంచి విత్తనాలకు రక్షణ, మొక్కల పెరుగుదల, పంటల దిగుబడికి దోహదపడతాయన్నారు. భోగాపురానికి చెందిన రైతు తిరుపతి ఏర్పాటు చేసిన నవధాన్యాలు, కంపోస్టు బ్లాకును సందర్శించారు. అమ్మపాలెంలో 55 మంది రైతులతో సీడ్ బాల్స్ తయారీని పరిశీలించారు. ఎన్‌ఎఫ్‌ఏ నవీన, రైతులు పాల్గొన్నారు.