Share News

ప్రగతి సూచికల్లో.. అద్వితీయం

ABN , Publish Date - May 09 , 2026 | 12:37 AM

రాష్ట్రవ్యాప్తంగా కీలకమైన ప్రగతి సూచికల్లో 97 పాయింట్లను నమో దు చేసి ఏలూరు జిల్లా టాప్‌–2 ర్యాంకు దక్కించు కుంది. జిల్లాలో ప్రగతి పరంగా ప్రధా నంగా గర్భిణులు, బాలిం తలు, చిన్నారుల ఆరోగ్యం, సరైన బరువు తూగడం, ప్రీ స్కూల్స్‌లో చిన్నారులు చేరిక తదితర అంశాలకు మార్కులు వేసి ర్యాంకు కేటాయించారు.

ప్రగతి సూచికల్లో..  అద్వితీయం
అమరావతిలో సీఎం సదస్సుకు హాజరైన కలెక్టర్‌ వెట్రిసెల్వి, ఎస్పీ కేపీఎస్‌ కిశోర్‌

హౌసింగ్‌లో పడిపోయిన ప్రగతి

అమరావతిలో రెండోరోజు సదస్సుకు హాజరైన కలెక్టర్‌ వెట్రిసెల్వి, ఎస్పీ కిశోర్‌

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

రాష్ట్రవ్యాప్తంగా కీలకమైన ప్రగతి సూచికల్లో 97 పాయింట్లను నమో దు చేసి ఏలూరు జిల్లా టాప్‌–2 ర్యాంకు దక్కించు కుంది. జిల్లాలో ప్రగతి పరంగా ప్రధా నంగా గర్భిణులు, బాలిం తలు, చిన్నారుల ఆరోగ్యం, సరైన బరువు తూగడం, ప్రీ స్కూల్స్‌లో చిన్నారులు చేరిక తదితర అంశాలకు మార్కులు వేసి ర్యాంకు కేటాయించారు. ప్రజల్లో ప్రభుత్వ పథకాల్లో సానుకూలత విషయంలో జిల్లా ఆరో ర్యాంకు, గృహ నిర్మాణ ప్రగతిలో జిల్లా 25వ స్థానంలో నిలిచింది. అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో రెండోరోజు కలెక్టర్‌ వెట్రిసెల్వితో పాటు ఎస్పీ కిశోర్‌ హాజరయ్యారు. ప్రధానంగా సూపర్‌సిక్స్‌ పథకాలు, గ్రీవెన్స్‌ నిర్వహణ, ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేత, నిధులు వినియోగంపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పీజీఆర్‌ఎస్‌లో సోమవారం వినతుల స్వీకరణతో పాటు ప్రతి శుక్రవారం ఒక నియోజక వర్గంలో ప్రజల సమస్యల పరిష్కారానికి కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు.

ఫిర్యాదుల పరిష్కారంలో–9

ప్రతిసోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)లో వెల్లు వెత్తిన సమస్యల పరిష్కారంలో జిల్లా ఓవరాల్‌గా 9వ స్థానంలో నిలిచింది. జిల్లాలో జనవరి నుంచి ఇప్పటి వరకు 7,625 పిటిషన్లు రాగా, ఇందులో 5,256 దరఖాస్తులను పరిష్కరించగా ఇంకా 2,369 పెండింగ్‌లో ఉన్నాయి. ప్రజల సంతృప్తిస్థాయి 96 శాతం శాతం బాగుందని, 4 శాతం బాగాలేదని తెలి పారు. గత ఏప్రిల్‌ నుంచి మే 1 వరకు 2,597 పిటి షన్లు స్వీకరించగా, అందులో 1,163 అర్జీలను పరిష్క రించగా ఇంకా 1,434 పెండింగ్‌లోనే ఉన్నాయి. ప్రజల సంతృప్తిస్థాయి 84 శాతం బాగుందని, 16 శాతం బాగాలేదని తేల్చి చెప్పారు.

ప్రజా సానుకూలతలో–6

జిల్లాలో ప్రభుత్వ పథకాలపై ప్రజలు సాను కూలత వ్యక్తం చేయడంలో జిల్లాకు ఆరో ర్యాంకు లభించింది. గత డిసెంబరు నుంచి ఫిబ్రవరి వరకు 71.6 శాతం బాగుందని సానుకూలత వ్యక్తం కాగా అది నాలుగు శాతం పెరిగి ఏప్రిల్‌ నుంచి మే వరకు 75.6 శాతం బాగుందని తేల్చి చెప్పారు. ఓవరాల్‌గా వివిధ ప్రభుత్వశాఖల పనితీరుపై ప్రజల్లో సాను కూలతలో జిల్లా ఆరో ర్యాంకును సాధించింది. ఓవ రాల్‌గా 11 శాఖలు సానుకూలతో వెనుకబడినట్టు లెక్క తేల్చారు. అవి ప్రధానంగా దేవాలయాల సేవలు, అన్న క్యాంటీన్లు, పంచాయతీ సర్వీస్‌లు, మహిళలపై వేధింపులు, దీపం–2, విద్యుత్‌ సేవలు, మధ్యాహ్న భోజనం, రవాణారంగంలో ట్యాక్స్‌ వసూళ్లు, హౌసింగ్‌ పథకాల్లో ఆయా విభాగాలు వెనుక బడ్డాయి. ప్రీ స్కూల్‌ హాజరు లో ఏలూరు 15వ స్థానంలో నిలిచింది. ఏప్రిల్‌ నాటికి 38,025 మందికి గాను 24,478 మంది చేరడానికి అనుమతి ఇచ్చారు. 21 రోజుల పైబడి స్కూల్స్‌కు వచ్చిన వారు 21,952 మందిగా నమోదయ్యారు. మొత్తం 89.83 శాతం నమోదైంది.

పల్లెపండుగ భేష్‌

పల్లెపండుగ 2.0 కింద 3,900 ఉద్యాన మొక్కలు నాటాలన్న లక్ష్యం కాగా జిల్లాలో 4,382 మొక్కలు నాటి మొత్తం 112 శాతం నమోదు సాధించారు. నాలుగు వేల పంట కుంటలు ఏర్పాటు లక్ష్యం కాగా 3,189 ఏర్పాటు చేసి జిల్లా 80 శాతం లక్ష్యానికి చేరుకుంది. పల్లె పండుగలో 25 కిలోమీటర్ల మేర బీటీ రోడ్లు అభివృద్ది చేయాల్సి ఉండగా 26.69 కిలోమీటర్లు పూర్తి చేశారు. వ్యక్తిగతంగా టాయిలెట్లకు సోక్‌పిట్ల లక్ష్యంలో 2,400 గాను 2,197 పూర్తి చేశారు. మ్యాజిక్‌ డ్రెయిన్లు 6.39 కిలోమీటర్లు పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టగా 3.33 కిలోమీటర్లు పూర్తి చేసి 52 శాతం ప్రగతి సాధించారు.

మంత్రి ఇలాకా.. హౌసింగ్‌లో వెనుకబాటు

రాష్ట్ర గృహ నిర్మాణశాఖ కొలుసు పార్థసారథి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏలూరు జిల్లాలో హౌసింగ్‌ పీఎంఏవై ఇళ్ల నిర్మాణాల్లో 25వ స్థానంకు జిల్లా దిగజారింది. జిల్లాలో 86,177 ప్రారంభించగా 52,877పూర్తి చేశారు. 33,300 ఇళ్లు పూర్తి చేయాల్సి ఉంది. 58 శాతం ప్రగతి నమోదైంది.

22ఏ పరిష్కారంలో 18వ స్థానం

22ఏ నిషేధిత భూముల పరిష్కారంలో జిల్లా 18వ స్థానంలో నిలిచింది. 297 అర్జీలు స్వీకరించగా 39 దరఖాస్తులను అనుమతించారు. 75 దరఖాస్తులను తిరస్కరించి 114 దరఖాస్తులను పరిష్కరించడంతో 38.38 శాతం ప్రగతి నమోదైంది.

వాట్సాప్‌ గవర్నెన్స్‌లో 21వ స్థానం

ప్రభుత్వం ప్రజల వివిధ దరఖాస్తులకు వాట్సాప్‌ గవర్నెన్స్‌ను ప్రవేశపెట్టగా జిల్లాలో స్పందన కరువైంది. ఈ వినియోగంలో జిల్లాలో గత నెలలో 35,103 మందితో 15వ స్థానంలో నిలవగా, ఈ వారంలో 4,668 మంది వినియోగంతో 21వ స్థానానికి పడిపోయింది.

నిధుల వినియోగంలో 24వ స్థానం

గత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో రూ.333 కోట్ల నిధులు అందుబాటులో ఉండగా రూ.298 కోట్లను ఖర్చు చేశారు. 92 శాతం ప్రగతి నమోదు కాగా జిల్లా 24వ స్థానంలో నిలిచింది.

టాయిలెట్లు.. డ్రింకింగ్‌వాటర్‌

జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణం, మంచినీటి సౌకర్యాల కల్పనలో జిల్లాకు 15వ స్థానం దక్కింది. 344 టాయిలెట్లకు 321 పూర్తి చేయగా, ఆర్వో పాంట్ల ఏర్పాటులో 323కు 278 పూర్తి చేశారు.

Updated Date - May 09 , 2026 | 12:37 AM