ఐదు నెలలుగా జీతాల్లేవ్..!
ABN , Publish Date - Aug 20 , 2026 | 12:09 AM
ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుధ్య సిబ్బంది, ఆయాలకు ఐదు నెలలుగా జీతాలు నిలిచిపోయాయి. పాఠశాలల్లోని మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ పరి శుభ్రతకు ప్రాధాన్యత ఇస్తున్న ఈ చిరుద్యోగులకు జీతాల బకాయిలు పేరుకుపోవడంతో వారు ఇబ్బం దులు పడుతున్నారు.
రూ.6 కోట్ల బకాయిలు విడుదల చేయాలని ప్రభుత్వ పాఠశాలల పారిశుధ్య సిబ్బంది ఆందోళన
ముదినేపల్లి, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుధ్య సిబ్బంది, ఆయాలకు ఐదు నెలలుగా జీతాలు నిలిచిపోయాయి. పాఠశాలల్లోని మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ పరి శుభ్రతకు ప్రాధాన్యత ఇస్తున్న ఈ చిరుద్యోగులకు జీతాల బకాయిలు పేరుకుపోవడంతో వారు ఇబ్బం దులు పడుతున్నారు. ప్రాథమిక, యూపీ పాఠశాల ల్లో ఒక్కొక్కరు, 300 మంది విద్యార్థులు పైబడి ఉ న్న హైస్కూళ్లలో ఇద్దరు పనిచేస్తున్నారు. ఈ లెక్కన ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రెండు వేల మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్నారు. వీరికి ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకు సుమారు రూ.6 కోట్ల వరకు జీతాల బకాయిలు చెల్లించాలి. నెలకు ఒక్కొక్కరికి రూ.ఆరు వేలు జీతం కాగా రూ.30 వేల చొప్పున బకాయిలు రావాల్సి వుంది. చిరుద్యోగం పైనే ఆధారపడిన వీరికి జీతాలు నెలల తరబడి చెల్లించకపోవడంతో కుటుంబ పోషణకు ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలల పని వేళల్లో పూర్తిగా పాఠశాలల వద్దే ఉండాల్సి రావడం, ఇతర పనులకు వెళ్లే అవకాశం లేక జీతంపైనే ఆధారపడి జీవిస్తున్నారు.
అధికారులు స్పందించాలి..
ఐదు నెలల జీతాలు లేక తాము పడుతున్న ఇబ్బందులను గుర్తించి విద్యాశాఖ అధికారులు స్పందించాలి. చిరుద్యోగులం. జీతాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. పాఠశాలల వద్ద పరిశుభ్రత కోసం పనిచేస్తున్న మాకు జీతాలు వెంటనే చెల్లించాలి.
– బత్తుల నాగరాణి, యూనియన్ ముదినేపల్లి మండల అధ్యక్షురాలు, వాడవల్లి
ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి..
పాఠశాలల్లో శానిటేషన్ సిబ్బందికి జీతాలు విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. చాలీచాలని జీతాలతో పనిచేస్తున్న తమకు నెలల తరబడి జీతాలు పెండింగ్‌లో ఉండడం తీవ్ర ఇబ్బందిగా ఉంది.
– ముడియం నాగమణి, ఏలూరు జిల్లా యూనియన్ కార్యదర్శి
ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం..
ఐదు నెలలుగా జీతాలు లేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొం టున్నాం. చాలామందికి ఉద్యోగమే ఆధారం. జీతాలు లేక అధిక వడ్డీలకు అప్పులు చేస్తున్నాం.
– నేతల విజయలక్ష్మి, యూనియన్ జిల్లా అధ్యక్షురాలు, బొమ్మినంపాడు
కలెక్టరేట్ వద్ద వర్కర్ల ధర్నా..
ఏలూరు రూరల్, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): కలెక్ట రేట్ వద్ద స్కూల్ శానిటేషన్ వర్కర్లు, నైట్ వాచ్ మెన్లు బకాయి జీతాల కోసం ఐఎఫ్‌టీయూ ఆధ్వ ర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. యూని యన్ జిల్లా గౌరవాధ్యక్షుడు బి.సోమయ్య మాట్లా డుతూ బకాయి జీతాలు చెల్లించాలని, జీవో నంబర్ 7 ప్రకారం రూ.15 వేలు కనీస వేతనం, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఐఎఫ్‌టీ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకటరావు, యూనియన్ జిల్లా అధ్యక్షురాలు టి.నాగమణి, కార్య దర్శి కె.విజయలక్ష్మీ, అనంతరం కలెక్టర్ వెట్రిసెల్వికి వినతిపత్రం అందజేశారు.