ఆ గదులను కూల్చేయండి!
ABN , Publish Date - Sep 26 , 2026 | 01:00 AM
తరగతి గదుల పైకప్పులు ప్రమాదకరం, వర్షపు నీరు కారుతుండటం, శ్లాబ్ నుంచి సిమెంటు పెచ్చులూడుతుండ టం, గోడల్లో పగుళ్లు, గదుల్లో గోతులు.. వెరసి పిల్లల భద్రతకు ముప్పుగా పరిణమించిన ఏలూరు జిల్లాలోని 88 ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 156 తరగతి గదులు శిథిలావస్థకు చేరుకోవడంతో తక్షణమే వాటిని కూల్చివేయాలని ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది.
ఏలూరు జిల్లాలో 88 పాఠశాలల్లో 156 తరగతి గదులు
నెలాఖరులోగా నేలమట్టం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు
ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో విద్యార్థులకు భరోసా
మన బడి – మన భవిష్యత్తులో నూతన తరగతి గదుల నిర్మాణానికి ప్రతిపాదనలు
(ఏలూరు అర్బన్–ఆంధ్రజ్యోతి):
తరగతి గదుల పైకప్పులు ప్రమాదకరం, వర్షపు నీరు కారుతుండటం, శ్లాబ్ నుంచి సిమెంటు పెచ్చులూడుతుండ టం, గోడల్లో పగుళ్లు, గదుల్లో గోతులు.. వెరసి పిల్లల భద్రతకు ముప్పుగా పరిణమించిన ఏలూరు జిల్లాలోని 88 ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 156 తరగతి గదులు శిథిలావస్థకు చేరుకోవడంతో తక్షణమే వాటిని కూల్చివేయాలని ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. కొద్దిరోజులుగా భారీవర్షాల నేపథ్యంలో సమగ్రశిక్షాభియాన్ జిల్లా ప్రాజెక్టు ఇంజనీరింగ్ వర్గాలు క్షేత్రస్థాయిలో జరిపిన పరిశీలనలో శిథిలావస్థ పాఠశాలల జాబితాను రూపొందించారు. వీటిని నెలాఖరులోగా కూల్చివేయాలని నిర్దేశిస్తూనే, కూల్చివేత బాధ్యతలను పలు శాఖలకు అప్పగించారు.
కూల్చివేత పనులు, భవన వ్యర్థాలను తర లించడం, తదితర కార్యకలాపాలను వేలం ప్రాతి పదికన ఎస్‌ఎంసీల పర్యవేక్షణలో చేపట్ట డానికి నిర్ణయించారు. గుర్తించిన వాటిలో ఇప్ప టివరకు చింతలపూడి మండలం నామవరం ఎంపీపీ స్కూలులో ఒక గది, ముదినేపల్లి హైస్కూల్‌లో ఎనిమిది గదులు, పోలసానిపల్లి ఏపీ సోషల్ వెల్ఫేర్ గర్ల్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో రెండు గదులను కూల్చివేశారు.
అద్దె భవనాల్లో తరగతుల నిర్వహణ
కొన్ని ఎయిడెడ్ పాఠశాలలను సంబంధిత యాజమాన్యాలు ప్రభుత్వానికి స్వాధీనం చేయ డంతో ప్రత్యామ్నాయంగా ఏర్పాటైన ఎంపీపీ పాఠశాలలను సమీప అద్దె భవనాల్లోనో, ప్రార్థనా మందిరాల్లోనో, షెడ్లలోనో తాత్కాలికంగా నిర్వహి స్తున్నారు. ఇలా విలీనమైన పాఠశాలల తరగతి గదులు పలుచోట్ల శిథిలావస్థలో ఉన్నాయి. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అనువుగావున్న రెండు, మూడు గదుల్లోనే పలు తరగతుల విద్యార్థులను కూర్చోబెట్టి క్లాసులు నిర్వహిస్తున్నారు. మరికొ న్నింటికి మరమ్మతులు కొనసాగుతున్నాయి. కొన్ని పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో ఉన్నాయి. ఇంకొన్నిచోట్ల గదులకు కొద్దిపాటి మరమ్మతులు చేస్తే సరిపోతుందని ఇంజనీరింగ్ వర్గాలు గుర్తించాయి.
ఈ మండలాల్లో టాప్
జిల్లాలోని 28 మండలాల్లో ద్వారకాతిరుమల, జంగారెడ్డిగూడెం, ముసునూరు మినహా, మిగతా మండలాలన్నింటిలో శిఽథిలావస్థకు చేరిన తరగతి గదులున్నాయి. అత్యధికంగా జీలుగుమిల్లి మండ లంలోని 12 పాఠశాలల్లో 22 తరగతి గదులు, కుక్కునూరు ఆరు పాఠశాలల్లో 16, మండవల్లి, ముదినేపల్లిలో ఐదేసి పాఠశాలల్లో 15 చొప్పున, బుట్టాయి గూడెంలో 11 పాఠశాలల్లో 14 తరగతి గదులు కూల్చివేతకు తొలివరుసలో ఉండగా, మిగతా మండలాల్లో ఒక తరగతిగది నుంచి 8 తరగతి గదుల వరకు ఉన్నాయి. శిథిలావస్థకు చేరిన తరగతి గదులను కూల్చి వేయాల్సిన నేప థ్యంలో ఇప్పటికే ఆయా తరగతి గదుల్లో క్లాసు లు నిర్వహించడం లేదని ఎస్‌ఎస్‌ఏ జిల్లా కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. భద్రతవున్న చోటకు తరగతులను షిఫ్ట్ చేసినట్లు వివరించా యి. కూల్చివేసిన తరగతి గదుల స్థానే మన బడి – మన భవిష్యత్తు పథకంలో కొత్తగా అద నపు తరగతి గదులను నిర్మించడానికి ప్రతిపాద లు, మరమ్మతులకు అవకాశం వున్నచోట నిధు లు మంజూరు చేస్తున్నట్టు వివరించాయి. విద్యా ర్థుల భద్రత దృష్ట్యా సెలవు రోజుల్లోనే కూల్చి వేత పనులను చేపడుతున్నట్టు తెలిపాయి.