Share News

డోంట్‌ కేర్‌!

ABN , Publish Date - Jun 17 , 2026 | 12:18 AM

విద్యా ర్థుల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని పూర్తిస్థాయి లో ఫిట్‌నెస్‌ కలిగిన బస్సుల్లోనే విద్యార్థులను తరలించాలని, నిబంధనలు అతిక్రమిస్తే సహించేది లేదంటూ ఇటీవల జిల్లాస్థాయిలో స్కూలు, కాలేజీ బస్సులు కల్గిన ప్రైవేటు విద్యా సంస్థల యాజ మాన్యాలతో అధికారులు సమావేశం నిర్వహించా రు

డోంట్‌ కేర్‌!
స్కూలు బస్సులను తనిఖీలు చేస్తున్న రవాణాశాఖ అధికారులు

నిబంధనలు పట్టించుకోని ప్రైవేటు విద్యా సంస్థల బస్సుల నిర్వాహకులు

రవాణాశాఖ అధికారుల తనిఖీ 32 బస్సులపై కేసు నమోదు

నిరంతం తనిఖీలు కొనసాగిస్తాం : డీటీసీ షేక్‌ కరీమ్‌

ఏలూరు క్రైం, జూన్‌ 16(ఆంధ్రజ్యోతి): విద్యా ర్థుల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని పూర్తిస్థాయి లో ఫిట్‌నెస్‌ కలిగిన బస్సుల్లోనే విద్యార్థులను తరలించాలని, నిబంధనలు అతిక్రమిస్తే సహించేది లేదంటూ ఇటీవల జిల్లాస్థాయిలో స్కూలు, కాలేజీ బస్సులు కల్గిన ప్రైవేటు విద్యా సంస్థల యాజ మాన్యాలతో అధికారులు సమావేశం నిర్వహించా రు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ కేపీఎస్‌ కిశోర్‌, జిల్లా ఉప రవాణాశాఖాధికారి షేక్‌ కరీమ్‌, పోలీస్‌, రవాణాశాఖ, ఇతర శాఖల అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. స్కూలు, కాలేజీ బస్సు లు నిబంధనలు తూచ తప్పకుండా పాటించాలని, డ్రైవర్లను ఉదయం విద్యాసంస్థలకు పిల్లలను తీసు కొచ్చేటప్పుడు, సాయంత్రం వారి ఇళ్లకు తీసుకెళ్లే టప్పుడు డ్రైవర్లను బ్రీత్‌ ఎనలైజర్లతో తనిఖీలు చేయాలని సూచించారు. పరిమితికి మించి విద్యా ర్థులను బస్సులో ఎక్కించుకోకూడదని, రోడ్లపైన ఎక్కడపడితే అక్కడ పార్కింగ్‌ చేయకూడదని సూచించారు. రవాణాశాఖ, విద్యాశాఖ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో ప్రైవేటు విద్యా సంస్థలకు 1,002 బస్సులు ఉన్నాయి. వీటిలో ఇప్పటికే 900 వరకూ ఫిట్‌నెస్‌లను రవాణాశాఖ అధికారులు తనిఖీలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో విద్యా సంస్థలు తెరిచే నాటికి అన్ని బస్సులు పూర్తిస్థాయిలో ఫిట్‌నెస్‌ ఉండాలని డీటీసీ షేక్‌ కరీమ్‌ హెచ్చరికలు జారీ చేయడమే కాకుండా ఏలూరులో మూడు ప్రత్యేక బృందాలు, నూజివీడు –1, జంగారెడ్డిగూడెం –1 బృందాలను ఏర్పాటు చేసి విద్యా సంస్థల బస్సు లను తనిఖీలు చేయించారు. తనిఖీల సమయంలో నిబంధనలు సరిగా ఉన్నప్పటికీ ఆ తర్వాత కొన్ని కొన్ని బస్సులు మళ్లీ నిబంధనలు అతిక్రమించి వాహనాలు నడుపుతున్నట్లుగా రవాణాశాఖ అధి కారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే డీటీసీ షేక్‌ కరీమ్‌ ఆదేశాలతో జిల్లాలో ఈనెల 15,16 తేదీల్లో ఆకస్మికంగా స్కూళ్లు, కాలేజీ బస్సులను తనిఖీలు చేయించారు. నిబంధనలు అతిక్రమించిన 32 బస్సు లపై కేసులు నమోదు చేశారు. ఎట్టిపరిస్థితుల్లో భద్రతా నియమాలు, నిబంధనలకు అనుగుణంగా బస్సుల్లో సదుపాయాలు లేకపోతే వాటిని సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. ప్రమాద రహిత డ్రైవింగ్‌ చేసినా, ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమించినా సహించేది లేదంటూ కఠిన చర్యలు తీసుకుంటామని డీటీసీ షేక్‌ కరీమ్‌ హెచ్చరికలు జారీ చేశారు. ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయన్నారు.

Updated Date - Jun 17 , 2026 | 12:18 AM