Share News

పాఠశాల భవనానికి రూ.80 లక్షలు

ABN , Publish Date - Aug 04 , 2026 | 12:42 AM

దుంపగడపలో దాతల సహకారంతో జడ్పీ పాఠశాల భవన నిర్మాణం శరవేగంగా జరుగుతోంది.

పాఠశాల భవనానికి రూ.80 లక్షలు
దుంపగడప హైస్కూల్‌ భవన నిర్మాణం

దాతల చొరవతో దుంపగడప హైస్కూల్‌ భవన నిర్మాణం

వాష్‌ రూమ్స్‌, కిచెన్‌ నిర్మాణం కోసం గ్రామస్థుల వినతి

సహకరించని అధికారులు

ఆకివీడు రూరల్‌, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): దుంపగడపలో దాతల సహకారంతో జడ్పీ పాఠశాల భవన నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు సూచనతో పిన్నమరాజు శ్రీనివాస రాజు దాతలను సమీకరించి పాఠశాల భవన నిర్మాణం ప్రారంభించారు. దాతలు దేవీ సీ ఫుడ్స్‌ సంస్థ, గ్రామస్థులు పిన్నమరాజు ప్రసాదరాజు ఆర్థిక సహకారం రూ.80లక్షలతో 8 తరగతి గదుల నిర్మాణం చేపట్టారు. నిర్మాణం పూర్తిచేసి సెప్టెంబరులో ప్రారంభించాలని లక్ష్యం.

వాష్‌రూమ్‌, కిచెన్‌ షెడ్‌పై స్పందించని అధికారులు

దుంపగడప జడ్పీ ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు సుమారు 207 మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో 120మంది బాలికలు. ఉపాధ్యాయులు సుమారు 10మంది ఉన్నారు. పాఠశాల భవన నిర్మాణం జరుగుతున్నా వాష్‌రూమ్‌, కిచెన్‌ షెడ్‌ల నిర్మాణానికి నిధులు మంజూరు కాలేదు. గ్రామస్థులు ఉన్నతాధికారులకు వినతి పత్రాలు అందజేసినా ఫలితం లేదు. పాఠశాల భవనం నిర్మాణం పూర్తయినా వాష్‌రూమ్‌, కిచెన్‌ షెడ్‌ లేకపోతే విద్యార్థులకు ఇబ్బందులు తప్పవని తల్లిదండ్రులు వాపో తున్నారు. దాతల సహకారానికి విలువలేకుడా పోతుందని, అధికారులు నిధులు వెంటనే మంజూరుకు కృషి చేయాలని కోరుతున్నారు.

అధికారులు పట్టించుకోవడం లేదు : శ్రీనివాసరాజు

దాతల సహకారంతో పాఠశాల భవనం నిర్మాణం చేస్తుంటే అధికారులు సహకారం శూన్యం. దాతలను సమీకరించుకున్నా కనీసం వాష్‌రూమ్‌, కిచెన్‌ షెడ్‌ మంజూరు చేయకుంటే ఎలా? అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. వెంటనే స్పందించాలి.

Updated Date - Aug 04 , 2026 | 12:42 AM