Share News

ఇంధనం ఆదా చేద్దాం..!

ABN , Publish Date - May 12 , 2026 | 12:54 AM

పెట్రోల్‌, డీజిల్‌ ప్రధాన ఇంధన వనరులు.. వీటి వాడకం తగ్గించాలంటూ ప్రధాని నరేంద్రమోదీ చేసిన ప్రకటనపై భిన్నాభి ప్రాయాలు వ్యక్తమైనప్పటికి చాలా మందిని ఆలోచింపచేస్తోంది.

ఇంధనం ఆదా చేద్దాం..!

ప్రధాని మోదీ పిలుపుపై చర్చ

పెట్రోల్‌, డీజిల్‌ వినియోగం తగ్గేనా ?

యంత్రాంగంలోనూ మార్పు కలిగేనా

అనవసర వాడకం తగ్గించాలి

ఇబ్బడిముబ్బడిగా వాహనాలు

పెట్రోల్‌, డీజిల్‌ ప్రధాన ఇంధన వనరులు.. వీటి వాడకం తగ్గించాలంటూ ప్రధాని నరేంద్రమోదీ చేసిన ప్రకటనపై భిన్నాభి ప్రాయాలు వ్యక్తమైనప్పటికి చాలా మందిని ఆలోచింపచేస్తోంది. రోజు, నెల, సంవత్సరం వారీ ప్రణాళిక ఇప్పటి నుంచి అమలు చేస్తే పెట్రోలు, డీజిల్‌ కొరత ఉండదు. దీనిపై విదేశీ మారకాన్ని ఆదా చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. దీనిపై ప్రజల్లో ఆలోచనలు, ఆసక్తి, ఇతర ప్రణాళికల రచనలు దిశగా అడుగులు వేస్తే ఇంధన వనరులు భవిష్యత్‌ తరాల అవసరాలకు ఇబ్బంది ఉండదు.

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

పెట్రోల్‌, డీజిల్‌ ప్రధాన ఇంధన వనరులు.. వీటి వాడకం తగ్గించాలంటూ ప్రధాని నరేంద్రమోదీ చేసిప ప్రకటన అందరిని ఆలోచింపచేస్తోంది. రోజూ, నెల, సంవత్సరం వారీ ప్రణాళిక ఇప్పటి నుంచి అమలు చేస్తే పెట్రోలు, డీజిల్‌ కొరత ఉండదు. దీనిపై విదేశీ మారకాన్ని ఆదా చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ ప్రజల్లో ఆలోచనలు, ఆసక్తి, ఇతర ప్రణాళికల రచనలు దిశగా అడుగులు వేస్తే కాలుష్య నియంత్రణతో పాటు ఇంధన వనరులు భవిష్యత్‌ తరాల అవసరాలకు ఇబ్బంది ఉండదు. అలాగే ఖర్చులు కూడా తగ్గుతాయి తాజాగా ఇరాన్‌–అమెరికా యుద్ధం చాలాకాలంగా కొన సాగడంతో ఇంధన వనరులు తీవ్ర ప్రభావం పడిన విషయాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తించుకొంటే మేలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏలూరు జిల్లాలో మూడు ఆయిల్‌ కంపెనీల పరిధిలో 232 పెట్రోల్‌ బంకులున్నాయి. ఇందులో సగటున పెట్రోల్‌ వినియోగం 3 లక్షల లీట ర్లు, డీజిల్‌ వినియోగం 2.60 లక్షల లీటర్లు వినియోగం ఉంటుందని అంచనా. పశ్చిమ గోదావరి జిల్లాలో 165 బంకులుండగా రోజుకు సగటున 3.50 లక్షల లీటర్ల వరకు డీజిల్‌, పెట్రోల్‌ 5 లక్షల లీటర్లు వినియోగం ఉంటుందని తెలుస్తోంది.

వాహనం లేనిదే కాలు కదలదు

500 మీటర్ల దూరం కూడా లేని కిరాణా దుకాణం లేదా పాలబూత్‌కు ద్విచక్ర వాహనాలు వినియోగం పరిపాటిగా మారింది. నాలుగు అడుగులు నడుద్దామన్న ఆసక్తి లేకుండా పోతోంది. ఇటీవల మైనర్లు సైతం ద్విచక్ర వాహనాలపై చక్కర్లు కొడుతున్నారు. అవసరం ఉన్నా లేకున్నా స్నేహితులను కలవడానికి బండి లేనిదే కదల్లేరు. ఒక్కొక్కరు కార్లల్లోనే షికార్లు చేస్తున్నారు.

బుల్లెట్‌.. సరదా కోసమే..

చాలామంది కాలేజీ స్టైల్లో భాగంగా రాయల్టీగా బుల్లెట్ల వాహనాల వినియోగం ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. లీటర్‌ పెట్రోల్‌ 25 కిలోమీటర్లు కూడా రాదు. 110 సీసీ ద్విచక్ర వాహనాల్లో కొన్ని బైక్‌లు 50 కిలోమీటర్ల లీటరు పెట్రోల్‌తో తిరిగేవారు. ఇప్పుడు 125 సీసీ వెహికల్స్‌ వచ్చాయి. ఆయిల్‌ వాడకం పెరిగింది.

ఇలా చేస్తే ..ఆదా చేయొచ్చు

ఉదయం లేవగానే మార్నింగ్‌ వాకింగ్‌ మొదలు పాల ప్యాకెట్‌ వినియోగం వరకు చాలా మంది ద్విచక్ర వాహనం లేనిదే కదలరు. హాయిగా కొంత దూరం నడిచి.. తర్వాత గ్రౌండ్‌లో వాకింగ్‌ చేస్తూ.. దగ్గరిలోనే ఇంటికి తీసు కెళ్లాల్సిన నిత్యావసరాలు, పాలు ప్యాకెట్లు తీసుకెళితే రోజుకు పావు లీటరు వరకు ఆదా చేయవచ్చు.

కాలేజీలు, స్కూల్స్‌ పిల్లలున్న తల్లిదండ్రులు ప్రణాళికాబద్దంగా వారితోనే రెడీ అయ్యి వారిని ఆయా సంస్థల్లో దించి.. తమ వ్యక్తిగత పనులు ఒక వాహనం వినియోగించే చేయడం ఉత్తమం.

ద్విచక్ర వాహనంపై ఒక్కరు ఎక్కినా.. ఇద్దరు ఎక్కి ప్రయాణించే వినియోగం ఒకటే. అలాంటప్పుడు ఒకే సంస్థలో పనిచేసే వారు కలిసి ఒకే బండిపై వారంలో కొన్ని రోజులు ఒకరి బండిపైన, మరొక వారం రెండో వ్యక్తి బండిపైనే విఽధులకు వెళ్లినా సగం పెట్రోలు ఖర్చు తగ్గుతుంది. ఇద్దరికి ఆదా అవుతుంది.

సాధ్యమైనంత వరకు సైకిల్‌పై పాలు, చిన్నపాటి నిత్యావసరాలు తెచ్చుకుంటే పెట్రోల్‌ వినియోగం తగ్గించుకునే అవకాశం ఉంది.

జిల్లా యంత్రాంగం కూడా..

జిల్లాలో పలు సమావేశాలకు సుదూరంగా వున్న అధికారులు కలెక్టరేట్‌కు చేరుకోవడం వల్ల పెట్రోల్‌, డీజిల్‌ ఖర్చు పెరుగుతుంది. జూమ్‌, టెలికాన్ఫరెన్స్‌లు నిర్వహించడం ఉత్తమం. ఒకరోజే దాదాపు అన్ని శాఖలతో కలిపి సమావేశాలు నిర్వహణ వల్ల ప్రభుత్వానికి, ఆయా శాఖల ఆయిల్‌ బడ్జెట్‌ తగ్గుతుంది. సమయంతో పాటు ఆయిల్‌ బిల్లు తగ్గుతుంది.

Updated Date - May 12 , 2026 | 12:54 AM