Share News

పల్లెపోరుకు సై

ABN , Publish Date - Oct 16 , 2026 | 12:40 AM

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగం గా జిల్లాలోని 542 గ్రామ పంచాయ తీలకు సంబంధించి 542 సర్పంచ్‌లు, 5,676 వార్డు మెంబర్ల పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ గురు వారం కలెక్టర్‌ వెట్రిసెల్వి గెజిట్‌ విడుదల చేశారు.

పల్లెపోరుకు సై

542 సర్పంచ్‌లు, 5,676 వార్డు సభ్యుల

పదవులకు రిజర్వేషన్లు ఖరారు

గెజిట్‌ విడుదల చేసిన కలెక్టర్‌ వెట్రిసెల్వి

(ఏలూరుసిటీ–ఆంధ్రజ్యోతి)

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగం గా జిల్లాలోని 542 గ్రామ పంచాయ తీలకు సంబంధించి 542 సర్పంచ్‌లు, 5,676 వార్డు మెంబర్ల పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ గురు వారం కలెక్టర్‌ వెట్రిసెల్వి గెజిట్‌ విడుదల చేశారు. రిజర్వేషన్లు ఖరారు కావడంతో పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి.

సర్పంచ్‌ల రిజర్వేషన్లు ఇలా..

జిల్లాలోని 542 పంచాయతీల్లో సర్పంచ్‌లకు సంబంధించి మహిళ లకు 266 స్థానాలు, జనరల్‌కు 276 స్థానాలు కేటాయించారు. వాటిలో షెడ్యూలు ఏరియాలోని పంచాయతీల్లో షెడ్యూలు తెగలకు 63 స్థానాలకు మహిళలకు 31 స్థానాలు, జనరల్‌కు 32 స్థానాలు కేటాయించారు. వందశాతం షెడ్యూలు తెగలు తండాలు కలిగిన 2 ఎస్టీ పంచాయతీల్లో ఒకటి మహిళకు, ఒకటి జనరల్‌కు కేటాయించా రు. నాన్‌ షెడ్యూలు ఏరియాలోని 479 పంచాయతీ సర్పంచ్‌ స్థానా లకు సంబంధించి షెడ్యూలు తెగలకు 6 స్థానాలకు గాను 2 మహిళ లకు, 4 జనరల్‌కు, షెడ్యూలు కులాలకు సంబంధించి 121 స్థానాలకు గాను 56 మహిళలకు, 65 జనరల్‌కు, వెనుకబడిన తరగతులకు సంబంధించి 104 స్థానాలకు గాను 52 మహిళలకు, 52 జనరల్‌కు, అన్‌ రిజర్వుడ్‌కు సంబంధించి 246 స్థానాలకు గాను 124 మహిళలకు, 122 జనరల్‌కు కేటాయించారు.

వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఇలా..

జిల్లాలో 542 పంచాయతీల్లో 5,676 వార్డులున్నాయి. షెడ్యూలు ఏరియాలోని 63 పంచాయతీల్లోని 626 వార్డు సభ్యుల పదవులకు గాను మహిళలకు 313, జనరల్‌కు 313 స్థానాలు కేటాయించారు. ఇందులో షెడ్యూలు తెగలకు సంబంధించి 403 స్థానాలకు గాను 187 మహిళలకు, 216 జనరల్‌కు, అన్‌ రిజర్వుడ్‌కు సంబంధించి 223 స్థానాలకు గాను 126 మహిళలకు, 97 జనరల్‌కు కేటాయించారు.

నాన్‌ షెడ్యూలు ఏరియాలో 479 పంచాయతీలకు సంబంధించి 5,050 వార్డులుండగా ఇందులో మహిళలకు 2,525, జనరల్‌కు 2,525 వార్డులు కేటా యించారు. ఇందులో ఎస్టీలకు 92 వార్డులకు గాను మహిళలకు 37, జనరల్‌కు 55, ఎస్సీలకు 1,289 వార్డులకు గాను మహిళలకు 560, జనరల్‌కు 729, బీసీలకు 1,099 వార్డులకు గాను మహిళలకు 521, జనరల్‌కు 578, అన్‌రిజర్వుడ్‌ కు 2,570 వార్డులకు గాను మహిళలకు 1,407, జనరల్‌కు 1,163 వార్డులు కేటాయించారు.

మార్గదర్శకాలను పాటించాలి..

ఏలూరుటూటౌన్‌, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి):ఎన్నికల కమీషన్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా స్థానికసంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్‌ వెట్రిసెల్వి అఽధికారులను ఆదేశించారు.గురువారం ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఎస్పీ ప్రతాప్‌ శివకిశోర్‌తో కలసి ఏలూరు కార్పొరేషన్‌, జంగారెడ్డి గూడెం, నూజివీడు, చింతలపూడి పురపాలక సంఘాల ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.అనంతరం నగరపాలక సంస్థలోని నామినేషన్‌ కేంద్రాలను పరిశీలించారు.

Updated Date - Oct 16 , 2026 | 12:40 AM