Share News

అరచేతిలో సంజీవని

ABN , Publish Date - Sep 27 , 2026 | 12:39 AM

ప్రజలకు వైద్య సేవలను మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం డిజిటల్‌ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనుంది.

అరచేతిలో సంజీవని

అక్టోబరు ఒకటి నుంచి తాడేపల్లిగూడెంలో పైలట్‌ ప్రాజెక్టు.. అన్ని వైద్య విధానాలు, ఆసుపత్రుల సేవలు ఒకే వేదికపైకి

భీమవరం, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి):ప్రజలకు వైద్య సేవలను మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం డిజిటల్‌ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనుంది. ఇందులో భాగంగా సంజీవని ప్రాజెక్ట్‌ అమలకు ప్రభుత్వం సిద్ధమైంది. జిల్లాలో పైలట్‌ ప్రాజెక్ట్‌గా తాడేపల్లిగూడెం ప్రాంతాన్ని ఎంపిక చేసింది. రాష్ట్రవ్యాప్తం గా సంజీవని సేవలు అందించే ప్రాజెక్ట్‌ రూపకల్పనకు ప్లాట్‌ఫామ్‌ రూపొందించే బాధ్యతను టాటా డయాగ్నిస్టిక్స్‌ అండ్‌ మెడికల్‌ సంస్థకు అప్పగించారు. ఇందులో ప్రతి ఒక్కరి ప్రొఫైల్‌ ఉంటుంది. అల్లోపతి, ఆయుష్‌, హోమియో పతి, సిద్ధ తదితర అన్ని రకాల వైద్య సేవలను ఒకే వేదిక పైకి తీసుకురానున్నారు. ఆసుపత్రుల వివరాలు కూడా అందుబాటులో ఉంటాయి. వ్యాధి రాకుండా ముందుగానే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సలహాలు ఇవ్వనున్నారు.

జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా..

అరచేతిలోనే వైద్య సేవలందించాలన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబు ప్రకటిస్తూ వస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు సంజీవని అని నామకరణం చేశారు. అక్టోబరు ఒకటో తేదీ నుంచి పైలట్‌ ప్రాజెక్ట్‌ అమలు కానుంది. ఇది విజయవంతమైన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా జనవరి ఒకటో తేదీ నుంచి సంజీ వని ప్రాజెక్ట్‌ను అమలు చేయనున్నారు. అందులో అన్ని రకాల ఆసుపత్రులను అనుసంధానం చేస్తారు. ఆరోగ్య సమస్యను చెబితే దానికి తగ్గ మందులు తీసుకోవడంపై సలహా అందుతుంది. ఒకసారి వైద్యుడిని సంప్రదించిన తర్వాత మళ్లీ ఎప్పుడు వెళ్లాలో, ఏ సమయంలో ఏ మందు ను వాడాలో తెలియజేస్తుంది. మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలకు సలహాలు, ఫిజియోథెరపీ సూచనలు అందుబా టులోకి రానున్నాయి. స్మార్ట్‌ ఫోన్‌ ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అనారోగ్యంతో బాధ పడుతున్న వారి వివరాలతోపాటు ప్రతి ఒక్కరి ఆరోగ్య ప్రొఫైల్‌ సంజీవని ప్రాజెక్ట్‌ యాప్‌లో ఉంటుంది. ఇప్పటికే ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొందిన వారు చిన్నపాటి సమస్యలు తలెత్తినప్పుడు ఏఐ సేవలను వినియోగించు కుంటున్నారని, ఏఐ సలహాలను పాటిస్తు న్నారని పేర్కొంటున్నారు. శస్త్రచికిత్సలు చేయించుకు న్నప్పుడు, ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొందుతున్నప్పుడు ఏఐ టూల్‌ ద్వారా సేవలు పొందే అవకాశం సంజీవనిలో అందుబా టులోకి రానుంది.

Updated Date - Sep 27 , 2026 | 12:39 AM