Share News

తెలంగాణకు అక్రమంగా ఇసుక తరలింపు

ABN , Publish Date - Mar 05 , 2026 | 12:19 AM

ఆంధ్ర నుంచి అక్రమంగా గత కొద్ది రోజులుగా తెలంగాణకు ఇసుక తరలిపోతుంది. ఆంధ్ర తెలం గాణ సరిహద్దు తాటియాకులగూడెం మీదుగా ఇసుకను తెలంగాణకు తరలిస్తున్నారు.

తెలంగాణకు అక్రమంగా ఇసుక తరలింపు
ఆంధ్ర సరిహద్దులో ట్రాక్టరుపై లోడు చేస్తున్న ఇసుక

జీలుగుమిల్లి, మార్చి 4(ఆంధ్రజ్యోతి) : ఆంధ్ర నుంచి అక్రమంగా గత కొద్ది రోజులుగా తెలంగాణకు ఇసుక తరలిపోతుంది. ఆంధ్ర తెలం గాణ సరిహద్దు తాటియాకులగూడెం మీదుగా ఇసుకను తెలంగాణకు తరలిస్తున్నారు. ఆంధ్ర నుంచి పలు అక్రమ మార్గాలను ఇసుక తరలిం చేందుకు తెలంగాణ వాసులు ఎంచుకున్నారు. జీలుగుమిల్లి మండలం రౌతుగూడెం నుంచి ట్రాక్టర్లపై తెలంగాణ ఆంధ్ర సరిహద్దు పొలాల్లో ఇసుకను ముందుగా గుట్టలుగా నిల్వ చేస్తున్నారు. మరోవైపు పోలవరం, కొవ్వూరు మీదుగా జాతీయ రహదారిపై ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో గోదారి ఇసుకను నిల్వ చేస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా సమీప తెలంగాణ వాసులు ట్రాక్టర్లపై ఇసుకను దర్జాగా హైవేపై సరిహద్దు దాటిస్తున్నారు. తెలంగాణలో ఇసుక కొరతతోపాటు అక్కడ ఇసుక కొండ కాలువల్లో దొరకడంతో నాణ్యత లోపిస్తోంది. గోదావరి ఇసుక పలు కట్టడాలకు నాణ్యత ఉండడంతో డిమాండ్‌ పెరిగింది. ఈక్రమంలో సరిహద్దు తెలంగాణ వాసులే ఇసుకను ఆంధ్ర నుంచి సరిహద్దులు దాటిస్తున్నారు. రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్‌పోస్టు ఉన్నప్పటికి సరైన నిఘా లేకపోవడంతో ఇసుకాసురుల అక్రమాలకు చెక్‌పెట్టే వారు కరువయ్యారని స్థానికులు చెబుతున్నారు.

Updated Date - Mar 05 , 2026 | 12:19 AM