శరీర దారుఢ్యం పెంచుకోండి
ABN , Publish Date - Mar 08 , 2026 | 12:53 AM
యువత వినోదాలను వదిలి శరీర దృఢత్వాన్ని పెంచుకోవాలని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పద్మభూషణ్ సైనా సెహ్వాల్ అన్నారు. శనివారం జరిగిన ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల 46వ వార్షికోత్సవంలో ఆమె ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ సూచన
భీమవరం రూరల్, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): యువత వినోదాలను వదిలి శరీర దృఢత్వాన్ని పెంచుకోవాలని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పద్మభూషణ్ సైనా సెహ్వాల్ అన్నారు. శనివారం జరిగిన ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల 46వ వార్షికోత్సవంలో ఆమె ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. క్రీడలతో శారీరక శ్రమ, మానసిక వికాసం కలుగుతుందన్నారు. తాను 21 ఏళ్ల నుంచి సినిమాలు గాని, ఎటువంటి వినోదాలు జరుపుకోకుండా ఫిట్‌నెస్ సాధించి దేశానికి విజయాలు అందించడమే లక్ష్యంగా సాగానన్నారు. విద్యార్థులు గురువులు, తల్లిదండ్రులు చెప్పిన విషయాలు పరిగణనలోకి తీసుకుని పనిచేస్తే సాధించలేని విజయమంటూ ఉండదని పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యుడు పాకా సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ అలవర్చుకుంటే ఎంతటి విజయాన్ని అయినా సాధించవచ్చన్నారు. కళాశాల సెక్రటరీ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ, సభ్యులు విజయ నరసింహరాజు, ప్రిన్సిపాల్ మురళీకృష్ణంరాజు పాల్గొన్నారు.