Share News

ఉత్తమ ప్రదర్శనగా ‘సహానా’ నాటిక

ABN , Publish Date - Jul 09 , 2026 | 12:17 AM

ఏలూరు నగరంలో హేలాపురి కళాపరిషత్‌, వైఎంహెచ్‌ఏ ఆధ్వర్యంలో నిర్వహించిన 18వ జాతీయ స్థాయి నాటిక పోటీల విజేతలను న్యాయనిర్ణేతలు మంగళవారం రాత్రి ప్రకటించారు.

ఉత్తమ ప్రదర్శనగా ‘సహానా’ నాటిక
ఉత్తమ నాటిక ‘సహానా’ బహుమతి అందుకుంటున్న సాంకేతిక నిపుణులు

ఏలూరురూరల్‌, జూలై8(ఆంధ్రజ్యోతి): ఏలూరు నగరంలో హేలాపురి కళాపరిషత్‌, వైఎంహెచ్‌ఏ ఆధ్వర్యంలో నిర్వహించిన 18వ జాతీయ స్థాయి నాటిక పోటీల విజేతలను న్యాయనిర్ణేతలు మంగళవారం రాత్రి ప్రకటించారు. నాలుగు రోజులపాటు పలు ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ ప్రేక్షకులను అలరించారు.

ఉత్తమ ప్రదర్శనగా గుంటూరు జిల్లాకు చెందిన అభినయ ఆర్ట్స్‌ ప్రదర్శించిన ‘సహానా’ నాటిక ప్రధమ బహుమతిని, యడ్లపాడుకు చెందిన మానవత సాగరి ప్రదర్శించిన ‘అందరూ మంచివారే.. కానీ!’ నాటిక ద్వితీయ బహుమతిని, హైదరాబాద్‌కు చెందిన స్వర్ణ సూర్య డ్రామా లవర్స్‌ ప్రదర్శించిన ‘స్త్రీ మాత్రే నమః’ నాటిక తృతీయ బహుమతిని, గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన మద్దుకూరి ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ ప్రదర్శించిన ‘మా ఇంట్లో మహాభారతం’ నాటిక ప్రత్యేక జ్యూరీ బహుమతిని అందుకుంది.

వ్యక్తిగత విభాగాల్లో ఉత్తమ నటుడిగా పి.వాసుదేవరావు, ద్వితీయ ఉత్తమ నటుడిగా ఎస్‌. పవన్‌కుమార్‌, ఉత్తమ నటిగా కుమారి కుసుమసాయి, ద్వితీయ ఉత్తమ నటిగా సురభి పూజిత, ఉత్తమ సహాయ నటుడు, హాస్య నటుడిగా పి.పండు, ఉత్తమ ప్రతినాయకుడిగా లక్ష్మణ శాస్త్రి, ఉత్తమ సంగీతానికి పి. లీలామోహన్‌, ఉత్తమ దర్శకుడిగా జె.రామారావు ఎంపికయ్యారు. బహుమతి ప్రదానోత్స సభలో హేలాపురి కళాపరిషత్‌ అధ్యక్షుడు పెదపాటి రామకృష్ణ అధ్యక్షతన వహించారు. ముఖ్య అతిథులుగా బుద్దాల వెంకట రామారావు, ముత్తవరపు సురేష్‌బాబు, బొప్పన నరసింహా రావు, గరికపాటి కాళిదాసు, మజ్జి సూర్యకాంతారావు, హేలాపురి కళాపరిషత్‌ గౌరవ అధ్యక్షులు గుత్తా కౌసలేంద్రరావు, మహ్మద్‌ ఖాజావలి పర్యవేక్షించారు.ఙ

Updated Date - Jul 09 , 2026 | 12:17 AM