సాగిపాడు అంగన్‌వాడీ సెంటర్.. ఓ డ్రామా..?!
ABN , Publish Date - Aug 06 , 2026 | 12:40 AM
ఏపీ ఫుడ్ కమిషన్ సభ్యుడు జె.కృష్ణకిరణ్ బుధవారం జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠ శాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలును ఆకస్మికంగా తనిఖీ చేశారు.
సాగిపాడు అంగన్‌వాడీ సెంటర్.. ఓ డ్రామా..?!
రెండు రోజుల తనిఖీలకు జిల్లాకు వచ్చిన ఫుడ్ కమిషన్ సభ్యుడు
పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుపై తనిఖీలు
సాగిపాడు అంగన్వాడీ కేంద్రం మూసి ఉంచడంపై ఆగ్రహం
ఏలూరు అర్బన్, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): ఏపీ ఫుడ్ కమిషన్ సభ్యుడు జె.కృష్ణకిరణ్ బుధవారం జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠ శాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆహారపదార్థాల నాణ్యత, వంట శాలల్లో పరిశుభ్రత, మెనూ అమలు తదితర అంశాలను నేరుగా తనిఖీ చేయడంతోపాటు, విద్యార్థులతో మాట్లాడారు. కోడిగుడ్ల బరువు, బియ్యం నాణ్యత, చిక్కీల పంపిణీలను పరిశీలించారు. కామవరపుకోట జడ్పీ హైస్కూలులో తనిఖీల సందర్భంగా ఆహార పదార్థాల నాణ్యతను మెరుగుపర్చు కోవాలని సూచించారు. అనంతరం తడికల పూడి జడ్పీ హైస్కూలును సందర్శించి ఆహార పదార్థాలను రుచి చూశారు. ఇక్కడి స్కూలు లో భోజన పథకం అమలు బాగుందని ప్రధా నోపాధ్యాయుడు సర్వేశ్వరరావును సత్కరిం చారు. ఈయన తనిఖీలు గురువారం కూడా కొనసాగుతాయి. ఫుడ్ కమిషన్ సభ్యుడి వెంట పౌరసరఫరాలు, విద్యా శాఖ, ఐసీడీఎస్, తది తర శాఖల అధికారులున్నారు.
అంగన్‌వాడీ సెంటర్ బోగస్ ?
కామవరపుకోట మండలం తడికలపూడి శివారు సాగిపాడులోని అంగన్‌వాడీ కేంద్రాన్ని ఫుడ్ కమిషన్ సభ్యుడు ఆకస్మికంగా సందర్శిం చినపుడు అక్కడి సెంటరు మూసివేసి ఉండ టాన్ని గమనించారు. దీనిపై ఆయన ఒకింత ఆశ్చర్యానికి, ఆగ్రహానికి గురైనట్టు తెలిసింది. స్థానిక చిన్నారుల కోసం ప్రభుత్వం నిర్వహి స్తున్న అంగన్‌వాడీ కేంద్రాన్ని మూసి ఉంచ డంపై మండిపడ్డారు. వాస్తవానికి అక్కడ సెంటర్ నిర్వహిస్తున్నట్టుగా గాని, నమోదిత పిల్లలున్నట్టుగా గాని ఆనవాళ్లు లేనట్టు తెలిసింది. ఈ విషయమై ఐసీడీఎస్ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ శారదను వివరణ కోరగా అక్కడి అంగన్‌వాడీ సెంటర్‌ను నిర్వహిస్తోన్న హెల్పర్ ఉన్నతాధికారులకుగాని, సూపరింటెం డెంట్‌కు గాని ముందస్తు సమాచారం ఇవ్వ కుండా మూసివేసింది. అంగన్‌వాడీ సెంటర్‌లో టీచరు పోస్టు ఖాళీగా ఉంది. ఫుడ్ కమిషన్ సభ్యుడు సందర్శించినపుడు ఆయన వెంట నేనులేను. ఇంతకు మించి వివరాలు తెలియ వన్నారు. స్థానిక ఐసీడీఎస్ అధికారుల వివరణ కోసం ఫోన్‌లో సంప్రదించగా ఎవరూ స్పం దించలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
–––––