23 బ్లాక్ స్పాట్‌ల వద్ద భద్రతా చర్యలు
ABN , Publish Date - Apr 24 , 2026 | 12:49 AM
‘జిల్లాలో తరచూ ప్రమాదాలు జరిగే 23 బ్లాక్ స్పాట్‌ల వద్ద రెండు నెలల్లో భద్రతా ప్రమా ణాలను పెంచుతాం.
భీమవరం టౌన్, ఏప్రిల్ 23(ఆంధ్రజ్యోతి): ‘జిల్లాలో తరచూ ప్రమాదాలు జరిగే 23 బ్లాక్ స్పాట్‌ల వద్ద రెండు నెలల్లో భద్రతా ప్రమా ణాలను పెంచుతాం. ఇక్కడ రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా హెచ్చరిక బోర్డులు, రేడి యం స్టిక్కర్లు, ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థను పటిష్టపరుస్తున్నాం’ అని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. పోలీసు, రవాణా, ఎన్‌హెచ్, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, రెవె న్యూ, మునిసిపల్ శాఖల ఉన్నతాధికారులతో కలిసి ఎస్పీ భీమవరం, తాడేపల్లిగూడెం, తణు కు, అత్తిలి, పెనుమంట్ర, పెనుగొండ, పోడూ రు, యలమంచిలి, నరసాపురం, మొగల్తూరు ప్రాంతాల పరిధిలో గుర్తించిన 23 బ్లాక్‌స్పా ట్లను గురువారం పరిశీలించారు. ఈ ప్రాంతా ల్లో నెలకొన్న భౌగోళిక పరిస్థితులు, రహదారి నిర్మాణ లోపాలు, ప్రమాదాలకు దారితీస్తున్న సాంకేతిక కారణాలను విశ్లేషించారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ప్రణాళికను అమలు చేస్తున్న ట్లు వెల్లడించారు. డీఎస్పీలు రఘువీర్ విష్ణు, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.