Share News

దోషులెవరు..?

ABN , Publish Date - Mar 25 , 2026 | 11:54 PM

ఏలూరులోని ఆర్టీసీ పెట్రోల్‌ బంకులో రూ.82 లక్షల పైబడి ప్రజా దుర్వినియోగంపై సరైన రీతిలో విచారణ సాగడం లేదన్న ఆరో పణలు వ్యక్తమవుతున్నాయి. అసలు కారకులెవ రనేది ఇంకా ప్రశ్నగానే మిగిలింది. స్వాహా అయిన సొమ్ములో మెజార్టీ మొత్తాలను జమ చేయించి చేతులు దులుపుకునే యత్నమే సా గింది.

దోషులెవరు..?
ఏలూరులోని ఆర్టీసీ పెట్రోల్‌ బంకు (ఫైల్‌)

కొలిక్కిరాని ఆర్టీసీ పెట్రోల్‌ బంకులో అక్రమాల వ్యవహారం

నెలల తరబడి సా..గుతున్న విచారణ..రూ.82 లక్షలు దుర్వినియోగం

రూ.63 లక్షలు తిరిగి ఆర్టీసీకి జమ

ఇంకా జమ కావాల్సింది రూ.19 లక్షలు

అక్రమంలో అందరూ బాఽధ్యులేనట..!

సస్పెన్షన్‌ కొనసాగింపుపై ఆర్టీసీ సంఘాల ధ్వజం

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

ఏలూరులోని ఆర్టీసీ పెట్రోల్‌ బంకులో రూ.82 లక్షల పైబడి ప్రజా దుర్వినియోగంపై సరైన రీతిలో విచారణ సాగడం లేదన్న ఆరో పణలు వ్యక్తమవుతున్నాయి. అసలు కారకులెవ రనేది ఇంకా ప్రశ్నగానే మిగిలింది. స్వాహా అయిన సొమ్ములో మెజార్టీ మొత్తాలను జమ చేయించి చేతులు దులుపుకునే యత్నమే సా గింది. గతేడాది నవంబరులో వెలుగు చూసిన ఈ కుంభకోణంలో 12 మంది సంస్థ, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల పాత్ర ఉందంటూ తేల్చి ఆయా మొత్తాల వసూళ్లకు ఆర్టీసీ అధికారులు సిద్ధం అయ్యారు. ముగ్గురు ఉద్యోగులను సస్పెం డ్‌ చేశారు. పోలీస్‌ కేసు నమోదుతో సరిపెటా ్టరు. పునర్‌ విచారణకు అధికారిని నియామకం చేయకపోవడంపై ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ధ్వజం ఎత్తుతున్నాయి. బంకులో యూపీఐ, ఫోన్‌ పే మొత్తాలకు సంబంధించిన మొత్తా లను ఎక్కువగా స్వాహా చేశారు. గతేడాది నవంబరులో అసిస్టెంట్‌ డిపో క్లర్క్‌ బాలరాజు, ఆడిట్‌ ఉద్యోగి సీహెచ్‌ సుందరయ్య, సీనియర్‌ అసిస్టెంట్‌ ఎంఎస్‌ రావులను యాజమాన్యం సస్పెండ్‌ చేసింది. తెరవెనుక స్వాహా చేసిన మొత్తాలను చెల్లిస్తే సస్పెన్షన్లు ఉండవనే కోణంలోనే రాజీ ఫార్ములాతో కీలక మొత్తాలను జమ చేయిం చారు. ఈక్రమంలో అధికారులు తప్పుల నుంచి బయటపడ్డారన్న ఆరోపణలు న్నాయి. అప్పట్లో డిపో మేనేజర్‌ రూ.12.5 లక్షలు, కార్గొ అసిస్టెంట్‌ మరికొంత మొత్తాలను చెల్లించి సస్పెన్షన్ల నుంచి బయటపడ్డారు. అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల నుంచి కొంత మొత్తాలను జమ చేయించారు. ఇలా దాదాపు రూ.63 లక్షలు పైబడి ఆర్టీసీకి జమ చేసిన విషయం తెల్సింది. ఇంకా రూ.19 లక్షలు పైనే ఆర్టీసీకి జమ కావాల్సి ఉంది. సస్పెండ్‌ అయిన ఉద్యోగులు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు మిగిలిన మొత్తాలను చెల్లిస్తేనే సస్పెన్షన్లు ఎత్తివేస్తామని ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పష్టం చేసినట్టు సమాచారం.

పోలీస్‌ కేసుతో సరి..

ఆర్టీసీ ఉద్యోగులను అక్రమంగా సస్పెండ్‌ చేశారని ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో వివిధ ఉద్యోగులు కలిసి పది రోజుల పైనే డిపో వద్ద ఆందోళనలు చేపట్టారు. డిసెంబరులోనే విజయ వాడ ప్రధాన కార్యాలయంలోనే ఆర్టీసీ జోన్‌ ఈడీ విజయరత్నం పునర్‌ విచారణకు అధికా రిని నియమిస్తామని ఉద్యోగ సంఘాల రాష్ట్ర నేతలకు హామీ ఇచ్చారు. దీంతో సంఘా లు ఆందోళనను విరమించాయి. అనంతరం పోలీస్‌ కేసు నమోదు చేసినా బాధ్యులెవరనేది ఇంకా తేల్చకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఫిబ్ర వరిలో విచారణకు వచ్చిన కాకినాడ డీపీటీ వో శ్రీనివాసరావు పర్యవేక్షణ చేయక పోవడం వలనే తప్పిదం జరిగిందని ఏమీ తేల్చకుండానే రిపోర్టులో నివేదించినట్టు చెబుతున్నారు.

అసలు దోషులెవరో తే ల్చరా?

పెట్రోలు బంకులో ప్రజాధనం దుర్విని యోగంపై విజయవాడ ఈడీ స్థాయిలో సమగ్ర విచారణ చేయకపోవడం వల్ల సస్పెన్షన్‌లో ఉన్న ముగ్గురు ఉద్యోగులు నష్టపోతున్నారు. మొత్తం 12 మంది కట్టి తీరాల్సిందేనంటూ మౌఖిక ఆదేశాలతో ఈ వ్యవహారం ఇప్పటిల్లో కొలిక్కి రాదని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. వాస్తవాలను తేల్చకుండా కాలయాపనపై ఉద్యోగ సంఘా లు త్వరలో కార్యాచరణకు దిగేందుకు సన్నద్ధ మవుతున్నాయి.

Updated Date - Mar 25 , 2026 | 11:54 PM