Share News

బీసీల అభివృద్ధికి రూ.52 వేల కోట్లు

ABN , Publish Date - Feb 23 , 2026 | 12:12 AM

బీసీ వర్గాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.52 వేల కోట్లను ఖర్చు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు.

బీసీల అభివృద్ధికి రూ.52 వేల కోట్లు
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న మంత్రి పార్థసారథి

మంత్రి పార్థసారథి

నూజివీడు, ఫిబ్రవరి 22(ఆంధ్ర జ్యోతి):బీసీ వర్గాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.52 వేల కోట్లను ఖర్చు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. స్థానిక రాజేష్‌ సర్కిల్‌ వద్ద జిల్లా రజక సంఘీయులు ఆత్మీయ సమా వేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లా డుతూ.. ‘రజకులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంక్షేమ పథకాలపై అవగా హన కల్పించేందుకు ఈ సభ ఏర్పాటు చేశాం. కులవృత్తులు లేకుండా సమాజం లేదు. బడుగు, బలహీన వర్గాల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి కృషి చేస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. బీసీ వర్గాలు పారిశ్రామికంగా ఎదగడానికి సహ కారం అందిస్తాను. సాంకేతికను జో డించి దుస్తులు శుభ్ర పరిచే యం త్రాలు కొనుగోలుకు బ్యాంకులు రుణాలు ఇప్పించడానికి సహకారం అందిస్తాను. రజకులకు సుమారు రూ.100 కోట్లు కేటాయించి వారి ఆర్థిక అభివృద్ధికి కూటమి ప్రభు త్వం చేయూతనిచ్చింది. రజకుల చె రువుల అభివృద్ధికి, వాటి హక్కు లను రజకులకు చెందేలా కృషి చేస్తాను. నూజివీడులో రజక కమ్యూనిటీ హాల్‌ నిర్మించనున్న కూటమి ప్రభుత్వం రజకుల ఎన్నో ఏళ్లనాటి కల అయిన షెడ్యూల్‌ కులంలో చేర్చడానికి, దోబీ ఘాట్స్‌, విద్యుత్‌ బిల్లులు రాయితీ కల్పించ డానికి, జీవో నంబర్‌ 111 అమలు చేయడానికి, చట్ట సభల్లో దామాసా ప్రకారం స్థానం కల్పించడానికి కృషి చేస్తాను. రజకుల సమస్యలను త్వరలో ప్రభుత్వానికి తెలియజే స్తా’అన్నారు.

అనంతరం రజకులకు ఇస్త్రీ పెట్టెలు అందజేశారు. పది వేల మంది రజకులు ఈ సభకు హాజర య్యారు. కార్యక్రమంలో శాసన మండలి మాజీ సభ్యులు డి.రామా రావు, కూటమి నాయకులు, రజకులు పాల్గొన్నారు.

Updated Date - Feb 23 , 2026 | 12:12 AM