Share News

రూప్‌చంద్‌.. సిరుల పంట!

ABN , Publish Date - Apr 23 , 2026 | 12:33 AM

నిన్న మొన్నటి వరకు పెట్టుబడి రాకుండా పోయిన రూప్‌చంద్‌ చేపకు నేడు ధర పెరిగి నిలకడగా ఉండడంతో పట్టుబడులకు సన్నద్దం అవుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు లక్షా 50వేల ఎకరాల్లో చేపల సాగు, 2లక్షల 25 వేల ఎకరాల్లో రొయ్యల సాగు అవుతోంది.

రూప్‌చంద్‌.. సిరుల పంట!

ధర పెరుగుదల.. కేజీ రూ.105

రైతుల కళ్లల్లో ఆనందం

నిడమర్రు ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి):సుదీర్ఘ కాలం తర్వాత రూప్‌చంద్‌ రైతుల కళ్లల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడంతో పండుగ వాతావరణం నెలకొంది. గత ఏడెనిమిది నెలలుగా రూప్‌చంద్‌కు ధరలేదు. మార్చి,ఏప్రిల్‌లో సము ద్రపు చేపల ఉత్పత్తి తగ్గుముఖం పట్టడంతో గోదావరి తీరంలో పెరిగే రూప్‌చంద్‌ చేపకు డిమాండ్‌ పెరిగింది. దీనితో పాటు వాగులు, వంకల్లో వేసవికి నీరు తగ్గడం వల్ల జనవరి నుంచి చేపల ఉత్పత్తి తక్కువగా ఉండడం వల ఆక్వా సాగు చేపలకు డిమాండ్‌ పెరిగి రైతు కళ్లల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. నిన్న మొన్నటి వరకు పెట్టుబడి రాకుండా పోయిన రూప్‌చంద్‌ చేపకు నేడు ధర పెరిగి నిలకడగా ఉండడంతో పట్టుబడులకు సన్నద్దం అవుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు లక్షా 50వేల ఎకరాల్లో చేపల సాగు, 2లక్షల 25 వేల ఎకరాల్లో రొయ్యల సాగు అవుతోంది.

పెరిగిన ధర.. రైతు లాభాల బాట

మార్కెట్‌లో ఇటు రూప్‌చంద్‌ రేటు, అటు శీలావతి రేట్లు పెరగడంతో చేపల మార్కెట్లు కళకళలాడుతున్నాయి. సాధారణంగా ఒక కేజీ రూపచంద్‌ తయారీకి రైతుకు అన్నీ కలిపి 90– 95 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. నేడు మార్కెట్‌ రేటు పెరగడంతో కేజీ చేప ధర రూ.105 –108 పలుకుతోంది. దీంతో కేజీకి సుమా రు 15 నుంచి 18 రూపాయలకు గిట్టు బాటు అవుతుంది.

తగ్గిన రూప్‌చంద్‌ సాగు

గత ప్రభుత్వ విధానాల వల్ల రూప్‌చంద్‌ సాగు పూర్తిగా తగ్గిపోయింది. 10 ఎకరాల కన్నా ఎక్కువ ఉన్న చెరువులకు ఆక్వా విద్యుత్‌ సబ్సిడీ లేకపో వడంతో బిల్లులు వేలాది రూపాయలు రావడంతో రైతులు బెంబేలెత్తి పోయారు. దీనికి తోడు ధర లేకపోవడంతో చెరువుల సాగు తగ్గించి వేయ డంతో రూప్‌చంద్‌ చెరువుల సాగు పూర్తిగా తగ్గి పోయింది. నేడు ప్రభుత్వ విధానాలు మారడం, తదనంతరం చేపల ధరలు పెరగడంతో మళ్లీ పాత రోజులు వచ్చాయని ఆశపడుతున్నారు. చెరువులకు కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ విషయంలో సబ్సిడీ ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - Apr 23 , 2026 | 12:33 AM