ఆర్వోబీల పనులు వేగవంతం
ABN , Publish Date - Jan 23 , 2026 | 12:31 AM
రైల్వే క్రాసింగు లు వద్ద ట్రాఫిక్ సమస్యలను నివారించడం లక్ష్యంగా రోడ్డు ఓవర్ బ్రిడ్జిలు (ఆర్వోబీ) నిర్మాణ పనులను వేగవంతం చేయా లని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు.
ఏలూరు క్రైం, జనవరి 22(ఆంధ్రజ్యోతి): రైల్వే క్రాసింగు లు వద్ద ట్రాఫిక్ సమస్యలను నివారించడం లక్ష్యంగా రోడ్డు ఓవర్ బ్రిడ్జిలు (ఆర్వోబీ) నిర్మాణ పనులను వేగవంతం చేయా లని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురు వారం ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి), దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌లతో సంయుక్తం గా సమీక్షించారు. ఏలూరు, దెందులూరు, కైకలూరు, ఉంగు టూరు నియోజకవర్గాల్లో 27 పనులుపై సుదీర్ఘంగా సమీ క్షించారు. భూ సేకరణ పనులు నిర్దేశించిన సమయం లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. జేసీ అభిషేక్‌గౌడ, డీఆర్వో విశ్వేశ్వరరావు తదితర అధికారులు పాల్గొన్నారు.
ఫ బాధిత మహిళలు సహాయం కోసం ఏర్పాటు చేసిన వన్‌స్టాప్ సెంటరుకు సహాయం కోసం వచ్చిన మహిళలకు మెరుగైన సహాయం అందించాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టరేటులోని గౌతమి సమావేశ మందిరంలో గురువారం వన్‌స్టాప్ సెంటర్, వర కట్న నిషధ చట్టంపై త్రైమాసిక సమీక్షా, కన్వర్జెన్స్ సమీవేశ సలహా బోర్డు మిషన్ శక్తి కింద సమావేశాన్ని కలెక్టర్ అధ్యక్షతన నిర్వహిం చారు. గృహ హింస, అత్యాచారాలు, లైంగిక వేధింపులు, బాల్య వివాహాలు సమస్య బాధితులు టోల్ ఫ్రీ 112, 181, 14416 నెంబర్లకు కాల్ చేసి సహాయం పొందవచ్చన్నారు.
హెల్మెట్, సీటు బెల్టుతోనే ప్రాణ రక్షణ
హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం కారణంగా రహదారి ప్రమాదాల నుంచి ప్రాణ రక్షణ పొందవచ్చని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్స వాల్లో భాగంగా ఏలూరు శాంతినగర్ నుంచి పాత బస్టాండ్ వరకు గురువారం నిర్వహించిన బైక్‌ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ రహదారి నిబంధనలపై అవగా హన కలిగి ఉండాలన్నారు. ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్ వద్ద ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఈ ర్యాలీలో పాల్గొన్నారు. రవాణా శాఖ ఉప కమిషనర్ కృష్ణారావు, ఆర్టీవో శేఖర్, ఏలూరు డీఎస్పీ శ్రావణ్‌కుమార్, ఏలూరు సాయి స్వర్ణ హీరో మోటార్స్ జనరల్ మేనేజర్ సోమేశ్వర రావు, నగరంలోని వివిధ మోటార్ వాహనాల డీలర్లు, జిల్లాలోని వివిధ శాఖల అధి కారులు పాల్గొన్నారు.