రూ.463 కోట్లు కావాలి
ABN , Publish Date - Nov 13 , 2026 | 12:01 AM
అర్నబ్, మురసు తుఫాన్ల ధాటికి ఆర్‌అండ్‌బీ రహదారులు ఛిద్రమయ్యాయి.
తుఫాన్‌తో 674 కిలోమీటర్ల మేర దెబ్బతిన్న రహదారులు
అత్యవసర మరమ్మత్తులకు రూ.64.24 కోట్లు అవసరం
ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన ఆర్‌అండ్‌బీ
భీమవరం రూరల్, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): అర్నబ్, మురసు తుఫాన్ల ధాటికి ఆర్‌అండ్‌బీ రహదారులు ఛిద్రమయ్యాయి. జిల్లా మొత్తం మీద 678 కిలోమీటర్ల మేర రహదారులు పాడైనట్లు అధికారులు తేల్చారు. అర్నబ్ తుఫాన్‌కు 552 కి.మీ వాటి అత్యవసర పనులకు రూ.52.78 కోట్లు, పూర్తిస్థాయిలో అభివృద్ధి రూ.299.55 కోట్లు మొత్తం రూ.352.33 కోట్లు అవసరమని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. పరిశీలనకు వచ్చిన కేంద్ర బృందానికి కూడా జిల్లా ఆర్‌అండ్‌బీ అధికారులు ఈ వివరాలు అందిం చారు.మురసు తుఫాన్‌తో జిల్లాలో 122 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. వాటికి అత్యవసర పనుల కింద రూ.11.46 కోట్లు, పర్మినెంట్ పనుల కింద 99.40 కోట్లు, మొత్తం 110.86 కోట్లు మొత్తం రెండు తుఫాన్లకు 463 కోట్లు అవసమవుతాయని ప్రభుత్వానికి నివేదిక పంపారు.
వాహనదారులకు ఇక్కట్లు
తుఫాన్ కష్టాల నుంచి ఇంకా తేరు కోలేదు. వాహనదారులకు అస్తవ్యస్త రహదారులు నరకం చూపిస్తున్నాయి. కోతకు గురైన రోడ్లపై నానా అవస్థలు పడుతున్నారు. భీమవరం మండలంలో అయితే అనాకోడేరు వెళ్లే రహదారి అర కిలోమీటరు పొడవునా వర్షపునీటితో మునిగి ఉంది. ఆ గ్రామానికి వెళ్లడం వాహనదారులకు రాత్రివేళల్లో భయంగా మారింది. చాలా మండలాల్లో పల్లపు ప్రాంత ఆర్‌అండ్‌బీ రహదారులు ఇంకా వర్షం ముంపులోనే ఉన్నాయి.