Share News

అతుకుల రోడ్లకు మోక్షమెప్పుడో..?

ABN , Publish Date - Mar 07 , 2026 | 12:18 AM

పదేళ్ళ కుపైగా ఎదురుచూస్తున్న రాష్ట్ర సరిహద్దు రోడ్లకు మోక్షం లేదా అని స్థానికులు ఎదురుచూస్తున్నారు.

అతుకుల రోడ్లకు మోక్షమెప్పుడో..?
అధ్వానంగా ఉన్న రాష్ట్ర సరిహద్దు అల్లిపల్లి రోడ్డు

పదేళ్లుగా నిర్మాణంపై నిర్లక్ష్యం

చింతలపూడి, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): మండలంలో రోడ్లు వేస్తున్నప్పటికీ పదేళ్ళ కుపైగా ఎదురుచూస్తున్న రాష్ట్ర సరిహద్దు రోడ్లకు మోక్షం లేదా అని స్థానికులు ఎదురుచూస్తున్నారు. ఇం దులో రాష్ట్ర సరిహద్దు అల్లిపల్లి రోడ్డు, చింతల పూడి బైపాస్‌ రోడ్లు ఉన్నాయి. మండలంలోని అల్లిపల్లి నుంచి తెలంగాణ రాష్ట్రం మందలపల్లి వరకు నిత్యం ప్రజలు వందల సంఖ్యలో వాహ నాలు సైతం రాకపోకలు సాగిస్తుంటాయి. తెల ంగాణ రాష్ట్రం సరిహద్దు వరకు బ్రహ్మాండమైన రోడ్డు వేసి పదేళ్ళు గడిచింది. అక్కడి నుంచి ఆంధ్ర రోడ్డు సరిహద్దు వరకు కేవలం 500 మీటర్ల రోడ్డు వేస్తే సరిపో తుంది. ఈ రోడ్డు గతుకులు, గోతులమయమై ప్రమాదకరంగా ఉన్నాయి. ఆంధ్ర సరిహద్దుకు రాగానే స్థానికులు, ఇరు రాష్ట్రాల ప్రజలు ఈ కాస్తా రోడ్డు వేస్తే సరిపోతుంది కదా అని పదేళ్ళుగా ఎదురుచూస్తున్నా పట్టించుకోవడం లేదు. ఈ 500 మీటర్ల రోడ్డు అతుకు కలప డానికి అధికారులు, ప్రజా ప్రతినిధులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ 500 మీటర్లు ఆంధ్ర సరిహద్దులో ఉంది. అప్పట్లో తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఈ సరిహద్దు వరకు తాము రోడ్డు వేస్తా మంటే అప్పట్లో స్థానికులు అడ్డుకున్నారు. 500 మీటర్ల ఆంధ్ర ప్రాంత రోడ్డు ఆక్రమిస్తున్నారం టూ అడ్డుకున్నారు. దీంతో తెలం గాణ సరిహద్దు రోడ్డు మాత్రమే ఆ రాష్ట్ర అధి కారులు నిర్మాణం చేశారు. ఇదిలా ఉండగా మరో సరిహద్దు రోడ్డు అయిన చింతలపూడి బైపాస్‌ రోడ్డు 2016లో అప్పటి ఎమ్మెల్యే పీతల సుజాత రూ.70 లక్షల వ్యయంతో తారు రోడ్డు వేయిం చారు. అయితే అక్కడి నుంచి వెయ్యి అడుగుల రోడ్డు వదిలే శారు. అప్పట్లో ఇదేమని ప్రజలు అడిగితే నిధు లు ఇక్కడి వరకే సరిపోయాంటూ రోడ్డు వేయ లేదు. ఈ వెయ్యి అడుగుల రోడ్డు వేయకపోవ డంతో రెండు రోడ్ల మధ్య వర్షాకాలం వస్తే గోతులమయం, భారీ వాహనాలు దిగబడడం జరుగుతుంది. ఇది జరిగి పదేళ్ళు అయినా ఈ అతుకు కలపడంలేదు. ఈ మార్గం కూడా గురుభట్లగూడెం రోడ్డు కలిపి తెలంగాణ రాష్ట్రం వైపు వెళ్తుంది. వీటికి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువే. కాని ఈ రెండు రోడ్లకు అతుకులు కలపకపోవడంతో రవాణకు ప్రజలు నరకం చూస్తున్నారు.

Updated Date - Mar 07 , 2026 | 12:18 AM