పుష్కర రోడ్లకు.. త్వరలో మోక్షం!
ABN , Publish Date - Nov 22 , 2026 | 12:11 AM
జిల్లాలో వచ్చే ఏడాది జూన్‌లో జరిగే గోదావరి పుష్కరాలకు తరలి వచ్చే భక్తుల కోసం సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం ముందస్తు చర్యలకు ఉపక్రమిం చింది. శాఖలవారీగా కోట్లలో ప్రతిపాదనలు ప్రభు త్వానికి చేరాయి.
పట్టాలెక్కనున్న ఆర్అండ్బీ రోడ్లు
కీలమైన మూడు రహదారులకు రూ.11.70 కోట్లు
డిసెంబరు మూడు నాటికి టెండర్ల పూర్తికి కసరత్తు
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
జిల్లాలో వచ్చే ఏడాది జూన్‌లో జరిగే గోదావరి పుష్కరాలకు తరలి వచ్చే భక్తుల కోసం సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం ముందస్తు చర్యలకు ఉపక్రమిం చింది. శాఖలవారీగా కోట్లలో ప్రతిపాదనలు ప్రభు త్వానికి చేరాయి. దశలు వారీగా రోడ్లు, భవనాల శాఖ పనులకు నిఽధులు మంజూరు ఉత్తర్వులు వస్తున్నాయి. జిల్లాలో కీలకమైన మూడు రహదారు లను భక్తుల రాకపోకలకు అనువుగా తీర్చిదిద్దేందకు రూ.11.72 కోట్ల నిఽఽధులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఇందులో రాష్ట్ర రహదారులతో కీలకమైన పుష్కర ఘాట్లకు వెళ్లే రోడ్లను అనుసంధానం చేయడంతోపాటు, విస్తరణకు చర్యలు తీసుకోనున్నా రు. ఏలూరు జిల్లాకు ఐదారు లక్షలకు పైగా భక్తులు వస్తార న్న అంచనాలు ఉన్నాయి. దీనికి తగట్టుగా మూడు రోడ్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టను న్నారు.
ప్రధానంగా చేపట్టే పనులివే
పట్టిసీమ నుంచి పోలవరం వైపుగా పుష్కర ఘాట్లకు వెళ్లే అఖండ గోదావరి కుడి ప్రధాన రోడ్డు విస్తరణ, అభివృద్ధికి రూ.రెండు కోట్లు విలువైన పనులకు టెండర్లు పిలవగా స్వాతి కన్స్ట్రక్షన్స్ తణుకు సంస్థ టెండరు దక్కించుకుంది. మరోవైపు చేబ్రోలు నుంచి ఉండి వైపు వెళ్లే రాష్ట్ర రోడ్డును రూ.4.72 కోట్లతో అభివృద్ధి చేయడానికి టెండర్లు ఆహ్వానించగా కేపీపీ ఇన్ఫ్రా సంస్థ టెండరు దక్కిం చుకుంది. ఇక కీలకమైన భీమడోలు–కామవరపు కోటకు ప్రధాన రహదారిని రూ.ఐదు కోట్లతో చేపట్టే పనులకు టెండర్లు పిలిచారు. డిసెంబరు 3వ తేదీ నాటికి టెండర్ ప్రక్రియ కొలిక్కి వస్తుంది. దీంతో మూడు పనులకు అగ్రిమెంట్లు పూర్తి చేసి పనులు ప్రారంభించడానికి అధికారులు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వను న్నారు. డిసెంబరు మూడో వారంలో పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
పోలవరం–కొవ్వూరు రోడ్డుకు మోక్షమెప్పుడో ?
ఇదిలా ఉండగా గూటాల– కొత్త పట్టిసీమ గ్రామాలను కలిపే పోలవరం– కొవ్వూరు మధ్య 30 కిలోమీటర్ల మేర ఏటిగట్టు రోడ్డు మలుపులు ప్రమాదాలకు తావిస్తున్నాయి. ఇటీవల ఇక్కడ తరచూ ప్రమాదాలు జరగడంతో పదుల సంఖ్యలో ప్రాణాలు గాలిలో కలిసిపోయిన సంఘటనలున్నా యి. పోలవరం, రాజమండ్రి, తాళ్లపూడి ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారిపై ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవడ ంతో పాటు, మలుపుల వద్ద ప్రమాదాల నివారణకు ఆర్అండ్ బీ అధికారులు, ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది.