Share News

రోడ్లు పోయి.. రాళ్లు మిగిలాయి

ABN , Publish Date - Nov 10 , 2026 | 12:53 AM

ఏలూరు జిల్లా మన్యం ప్రాంతంలో మురసు తుఫాన్‌ మిగిల్చిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. గంటల వ్యవధిలోనే ఏజెన్సీని అతలాకుతలం చేసింది. కుండపోత వర్షాల కారణంగా కొండరెడ్ల నివాస ప్రాంతాల్లోని రహదారులు నామరూపాలు లేకుండా కొట్టుకుపోయి వాగు లు, కాలువల మాదిరిగా మారాయి.

రోడ్లు పోయి.. రాళ్లు మిగిలాయి
రోడ్డు కొట్టుకుపోయి బండరాళ్లు మాత్రమే మిగిలిన గానుగమామిడి–డోలుగండి రహదారి

బుట్టాయగూడెం, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): ఏలూరు జిల్లా మన్యం ప్రాంతంలో మురసు తుఫాన్‌ మిగిల్చిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. గంటల వ్యవధిలోనే ఏజెన్సీని అతలాకుతలం చేసింది. కుండపోత వర్షాల కారణంగా కొండరెడ్ల నివాస ప్రాంతాల్లోని రహదారులు నామరూపాలు లేకుండా కొట్టుకుపోయి వాగు లు, కాలువల మాదిరిగా మారాయి. అలివేరు నుంచి గానుగమామిడి–డోలుగండి మీదుగా కొండరెడ్డి గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా వరద నీటికి కొటుకుపోయింది. 2018 లో నల్ల మెటల్‌తో రహదారి వేయగా కరోనా కారణంగా బీటీ రోడ్డు నిర్మాణం ఆగిపోయింది. రేపల్లె, రేగులపాడు, డోలుగండి, గానుగమా మిడి, డోలుగండి కాలనీ, మోదేలు కొండరెడ్డి గ్రామాలకు ఇదే ప్రధాన రహదారి. సుమారు 500 మంది కొండరెడ్లు అన్ని అవసరాలకు బయట ప్రాంతాలకు రావాలంటే ఇదే దారిలో ప్రయాణం చేయాలి. ప్రస్తుతం రోడ్డు పూర్తిగా కొట్టుకు పోయి బండరాళ్లు మాత్రమే కనిపిస్తు న్నాయి. ఊట నీరు కారణంగా రాళ్లపై నడిచి వస్తున్న కొండరెడ్లు జారిపడిపోతూ గాయాల పాలవుతున్నారు. స్థానిక ఎన్నికల సందర్భంగా ఇదే రోడ్లపై పడుతూ లేస్తూ ఓట్లు వేయడానికి వచ్చారు. రోజులు గడుస్తున్నా అధికారులు కన్నెత్తి చూడక పోవడంతో రేపల్లే, రేగులపాడు గ్రామాలకు చెందిన కొండరెడ్లు మట్టితో గోతులు పూడ్చి రాళ్లను మట్టితో కప్పుకున్నారు. అధికా రులు స్పందించి రహదారిని బాగుచేయాలని ఏఐకే ఎంఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కారం రాఘవ డిమాండ్‌ చేశారు.

Updated Date - Nov 10 , 2026 | 12:53 AM