Share News

హైవేను కబళిస్తున్న చెరువు

ABN , Publish Date - Jul 06 , 2026 | 12:28 AM

ముదినేపల్లి – భీమవరం స్టేట్‌ హైవేను వడాలి వద్ద పంచాయతీ చెరువు కబళించేస్తోంది. నీటికోతకు గురై ఈ ప్రధాన రహదారి మార్జిన్‌ పూర్తిగా చెరువులో కలిసి పోయింది.

 హైవేను కబళిస్తున్న చెరువు
వడాలి వద్ద స్టేట్‌ హైవేను కబళిస్తున్న పంచాయతీ చెరువు

వడాలి వద్ద స్టేట్‌ హైవేను కబళిస్తున్న పంచాయతీ చెరువు

గట్టు లేక పెరుగుతున్న కోత.. పట్టని ఆర్‌అండ్‌బీ అధికారులు

ముదినేపల్లి, జూలై 5 (ఆంధ్రజ్యోతి): ముదినేపల్లి – భీమవరం స్టేట్‌ హైవేను వడాలి వద్ద పంచాయతీ చెరువు కబళించేస్తోంది. నీటికోతకు గురై ఈ ప్రధాన రహదారి మార్జిన్‌ పూర్తిగా చెరువులో కలిసి పోయింది. కొన్నే ళ్లుగా ఈ రోడ్డు కోతకు గురవుతున్నా ఆర్‌అండ్‌బీ అధికారులు పట్టించుకోక పోవడంపై విమర్శలు వ్యక్తమవు తున్నాయి. ఈ చెరువుకు రోడ్డు పొడవుగా గట్టు లేక కోత మరింత ఎక్కువైంది. పలుచోట్ల తారు రోడ్డు అండలుగా విరిగి పడిపోతోంది. సింగరాయపాలెం నుంచి ముదినేపల్లికి వెళ్లేటప్పుడు ఆ చెరువు వద్ద ఆదమరిస్తే వాహనాలు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి. రోడ్డు కోతకు గురై ప్రమాదకరంగా ఉన్నా ఆర్‌అండ్‌బీ అధికారులు కోతను నివారించేందుకు ఏ చర్యలు తీసుకోవడం లేదు. ఆ ప్రదేశం వద్ద రోడ్డు వెడ ల్పు తగ్గిపోతోంది. భారీ వాహ నాల రాకపోకలకు ఇబ్బందికరంగా ఉంది. చెరువుకు రోడ్డు వైపు గట్టు లేకపోవడంతో రోడ్డే చెరువు గట్టుగా మారింది. చెరువు పొడవుగా రోడ్డుకు రిటైనింగ్‌వాల్‌ నిర్మించి కోతను నివారించాలని పలువురు కోరుతున్నారు. ‘పంచాయతీ చెరువు నీటివల్ల రోడ్డు కోతకు గురవుతోంది. దీనిని అరికట్టేందుకు ప్రస్తు తం చెరువు లీజు కాలం ముగిశాక చెరువును ఎండగట్టి రోడ్డు కోతకు గురి కాకుండా పటిష్ఠగా గట్లు నిర్మిస్తాం. రోడ్డు కోతను నివారిస్తా’మని కార్యదర్శి విజయబాబు తెలిపారు.

Updated Date - Jul 06 , 2026 | 12:28 AM