ఇళ్లలోకి వరదనీరు వచ్చేలా తూరల ఏర్పాటు..!
ABN , Publish Date - May 25 , 2026 | 12:12 AM
జాతీయ రహదారి నిర్మాణంలో ఇటీవల భాగంగా పలుచోట్ల రోడ్డుకు ఇరువైపులా వరదనీరు పారేలా ఎన్‌హెచ్ అధికారు లు పనులు చేపట్టారు.
ఎన్‌హెచ్ రోడ్డు నిర్మాణంలో అధికారుల నిర్వాకం
ఆందోళనలో జీలుగుమిల్లి సీఆర్‌ఆర్ కాలనీవాసులు
జీలుగుమిల్లి, మే 24 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారి నిర్మాణంలో ఇటీవల భాగంగా పలుచోట్ల రోడ్డుకు ఇరువైపులా వరదనీరు పారేలా ఎన్‌హెచ్ అధికారు లు పనులు చేపట్టారు. ఇందులో భాగం గా స్థానిక సీఆర్‌ఆర్ కాలనీ సమీపంలో జాతీయ రహదారిపై పెద్ద పెద్ద తూరలు ఏర్పాటు చేశారు. రోడ్డుపై నీరు నిలువ కుండా జాగ్రత్తలు తీసుకు నేందుకు డ్రె యినేజీ ఏర్పాటు చేయాల్సిన అధికారులు ఒకవైపు నుంచి మరోవైపునకు వర్షం నీరు రోడ్డు కింద నుంచి వెళ్లేందుకు తూరలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో వరదనీరు ఇళ్ల మీద పడుతుందని కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నా రు. సుమారు 100 ఇళ్లు ఉన్న ప్రాంతం లో వర్షాకాలంలో ఆ తూరల వెంట వచ్చే వరదనీటితో ఇబ్బందులు తప్పవని ఆవే దన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను పరి ష్కరించాలని స్థానిక ప్రజాప్రతినిధు ల్ని, అధికారులను కోరుతున్నారు. తమ ఇళ్ల మీదకు వరదనీరు వచ్చేలా పనులు జరుపుతున్నారని, ఇప్పటికే గ్రామంలో ఎన్‌హెచ్ రోడ్డు నిర్మాణం పేరుతో గ్రామంలో సగం మంది భూములు కోల్పోవాల్సి వచ్చిందని, ఇప్పుడు ఇళ్ల మధ్య ఎటువంటి డ్రెయినేజీ సదుపాయం లేకుండా తూరలు ఏర్పాటు చేయడం వల్ల తీవ్రంగా నష్టపోతామని వాపోతున్నారు. ఈ విషయమై ఎన్‌హెచ్ ఏఈ కాజాను వివరణ అడగ్గా రోడ్డు నిర్మాణానికి ముందుగానే ఇరిగేషన్ ఎన్‌హెచ్ అధికారులు సర్వే చేశారని, ఆ ప్రాంతంలో తూరలు ఏర్పాటు చేసేందుకు పాయింట్ పెట్టారన్నారు.