Share News

రోడ్డు ప్రమాదాలు..క్రైం రేట్‌ తగ్గుముఖం : ఐజీ

ABN , Publish Date - Mar 08 , 2026 | 02:21 AM

జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తగా ్గయని ఏలూరు రేంజ్‌ ఐజీ జి.వి.అశోక్‌ కుమార్‌ అన్నా రు.

రోడ్డు ప్రమాదాలు..క్రైం రేట్‌ తగ్గుముఖం : ఐజీ
లక్కవరంలో మాట్లాడుతున్న ఐజీ అశోక్‌కుమార్‌

చింతలపూడి/జంగారెడ్డిగూడెం రూరల్‌, మార్చి 7 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తగా ్గయని ఏలూరు రేంజ్‌ ఐజీ జి.వి.అశోక్‌ కుమార్‌ అన్నా రు. చింతలపూడి సర్కిల్‌ కార్యాలయాన్ని, జంగారెడ్డి గూడెం మండలం లక్కవరం పోలీస్టేషన్‌ను శనివారం తనిఖీ చేసిన ఆయన మాట్లాడుతూ.. ‘2023 నుంచి 2025 వరకు జరిగిన రోడ్డు ప్రమాదాలను పరిగణనలోకి తీసుకుని జిల్లాలో 23 యాక్సిడెంట్‌ స్పాట్‌లను గుర్తిం చాం. జంగారెడ్డిగూడెం ఏరియాలో పాత రోడ్లను హైవేలుగా మార్చిన దగ్గర నుంచి ఆ ప్రాంతంలో ప్రమాదాలు పెరిగాయి. చింతలపూడి ప్రాంతంలో రెండు చోట్ల డేంజర్‌ మైనర్లకు బైక్‌లు ఇస్తే యజమానులపై కేసులు నమోదు చేస్తాం. ఒడిశా నుంచి జంగారెడ్డిగూడెం మీదుగా తెలం గాణకు తరలిస్తున్న గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నాం. జిల్లాలో క్రైం

రేట్‌ అదుపులో ఉంది. పాత నేరస్తుల కదలికలపై నిఘా పెంచాం. నేర పరిశోధ నల్లో టెక్నాలజీని ఉపయోగించడంలో ఏలూరు జిల్లా పోలీసు యంత్రాంగం ముందంజలో ఉంది. చింతలపూడి సర్కిల్‌ పరిధిలో నేరాలు పెద్దగా లేవు. లక్కవరం పోలీస్టేషన్‌ పరిధిలో క్రైం రేట్‌ తక్కువగా ఉంది. దీనిని రూరల్‌ పోలీస్టేషన్‌గా మార్చి జంగారెడ్డిగూడెం పట్టణ పోలీస్టేషన్‌పై పని భారంతో పాటు క్రైం రేటు తగ్గించేలా గతంలోనే ప్రతిపాదనలు పంపాం’ అని పేర్కొన్నారు. చింతలపూడిలో ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించి ఆవరణలో మొక్కలు నాటారు. ఎస్పీ ప్రతాప శివకిశోర్‌, ఏఎస్పీ సుస్మిత, సీఐలు క్రాంతికుమార్‌, ఎంవీ సుభాష్‌ ఎస్‌ఐలు సతీష్‌కుమార్‌, జబీర్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 08 , 2026 | 02:21 AM