Share News

మూణ్ణాళ్ల ముచ్చట!

ABN , Publish Date - Jun 11 , 2026 | 12:38 AM

దాదాపు 15 ఏళ్ల తర్వాత మండలంలో దెబ్బతిన్న రహదారుల పునఃనిర్మాణానికి ప్రభుత్వం రూ.ఐదు కోట్లు మంజూ రు చేయగా ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో మేడేపల్లి నుంచి రెడ్డిగూడెం క్రాస్‌రోడ్డు వరకు, రెడ్డిగూడెం క్రాస్‌రోడ్డు నుంచి రుద్రమ్మకోట వరకు, వేలేరుపాడు నుంచి రుద్రమ్మకోట వరకు, వేలేరుపాడు నుంచి కోయిదా వరకు రహదారుల పునఃనిర్మాణం పేరిట కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి పూర్తి చేయించారు.

మూణ్ణాళ్ల ముచ్చట!
వేలేరుపాడు–రుద్రమ్మకోట రహదారిలో దెబ్బతిన్న ఆర్‌అండ్‌బీ రహదారి

రూ.ఐదు కోట్లతో రహదారుల నిర్మాణం

నిర్మాణాల్లో నాణ్యత లోపాలు

మూడు నెలలకే ధ్వసమవుతున్న వైనం

వేలేరుపాడు, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): దాదాపు 15 ఏళ్ల తర్వాత మండలంలో దెబ్బతిన్న రహదారుల పునఃనిర్మాణానికి ప్రభుత్వం రూ.ఐదు కోట్లు మంజూ రు చేయగా ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో మేడేపల్లి నుంచి రెడ్డిగూడెం క్రాస్‌రోడ్డు వరకు, రెడ్డిగూడెం క్రాస్‌రోడ్డు నుంచి రుద్రమ్మకోట వరకు, వేలేరుపాడు నుంచి రుద్రమ్మకోట వరకు, వేలేరుపాడు నుంచి కోయిదా వరకు రహదారుల పునఃనిర్మాణం పేరిట కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి పూర్తి చేయించారు. అయితే ఈ రహదారుల నిర్మాణం అతుకుల బొంతగా అక్కడకక్కడ రోడ్లు తవ్వి తారువేశారు. మరికొన్ని చోట్ల రహదారి పూర్తిగా లేచిపోయినప్పటికి తారు వేయ లేదు. రహదారుల నిర్మాణం చేస్తున్నప్పుడే వీటి నిర్మాణం పట్ల స్థానికులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఏ మాత్రం నాణ్యత పాటించకుండా కాంట్రాక్టర్లు తమ ఇష్టానుసారంగా రహదారులను నిర్మించగా అవి ఇప్పుడు పాడైపోయి పూర్వ స్థితికి వచ్చేస్తున్నాయి. వెట్‌మిక్స్‌ లేచిపోయి తిరిగి గుంత లుగా ఏర్పడుతున్నాయి. రహదారిపై భారీ పగుళ్లు ఏర్పడి ద్విచక్రవాహనాలకు ఇబ్బందిగా మారుతు న్నాయి. వేలేరుపాడు–రుద్రమ్మకోట రహదారిపై కొత్తగా నిర్మించిన తారురోడ్డు గుంతలుపడి లేచిపోతుండగా రుద్రమ్మకోట – రెడ్డిగూడెం క్రాస్‌రోడ్డు వరకు నిర్మించిన రహదారిపై భారీ పగుళ్లు ఏర్పడ్డాయి. ఇదిలా ఉండగా వేలేరుపాడు, కోయిదా రహదారిపై వేసిన తారురోడ్డు అస్తవ్యస్తంగా మారుతోంది. ఈ రోడ్డును పూర్తి స్థాయు లో నిర్మించకుండా అక్కడక్కడ బిట్లుగా మాత్రమే నిర్మించి చేతులు దులుపుకున్నారు. మంజూరైన రూ.ఐదు కోట్లతో రహదారులను పూర్తి స్థాయిలో అభి వృద్ధి చేస్తారనుకుంటే అక్కడక్కడ మాత్రమే రహదారు లను బిట్లుబిట్లుగా నిర్మించడం వెనుక భారీగా అవినీతి చోటు చేసుకుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. రహదారి పనులు జరుగుతున్నప్పుడు దగ్గరుండి పర్యవేక్షించా ల్సిన ఆర్‌అండ్‌బీ అధికారులు అటువైపు రాకపోవడంతో కాంట్రాక్టర్‌ తన ఇష్టారాజ్యంగా రహదారులను నిర్మించారు. అవి ఇప్పుడు పూర్తిగా ధ్వంసమయ్యే పరిస్థితులు ఏర్పడు తున్నాయి. ఇదిలా ఉంటే రహదారి నిర్మించిన తర్వాత రోడ్డుకు ఇరువైపులా సైడ్‌ బర్మ్‌స్‌ నిర్మించాల్సి ఉంది. రెండు మీటర్ల వెడల్పుతో ఇరువైపులా గ్రావెల్‌ వేయాల్సి ఉన్నా ఎక్కడ గుప్పెడు గ్రావెల్‌ వేయలేదు. రహదారుల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ నిర్వహించి బాధ్యులైన కాంట్రాక్టర్లు, అధికారులపై చర్యలు తీసుకోవాలని మండలవాసులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Jun 11 , 2026 | 12:38 AM