రైస్ పుల్లింగ్ మోసంతో నట్టేట మునిగాం..
ABN , Publish Date - Apr 03 , 2026 | 01:01 AM
రైస్ పుల్లింగ్ వ్యవ హారంలో రూ.కోట్లు ఆదాయం వస్తుందంటూ తమను నమ్మించి నట్టేట ముంచారని నూజివీడుకు చెందిన బాధితులు వాపోతు న్నారు.
పోలీసులను ఆశ్రయించిన బాధితులు
కేసు నమోదులో జాప్యం
తమకు న్యాయం చేయాలంటూ విజ్ఞప్తి
నూజివీడు టౌన్, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): రైస్ పుల్లింగ్ వ్యవ హారంలో రూ.కోట్లు ఆదాయం వస్తుందంటూ తమను నమ్మించి నట్టేట ముంచారని నూజివీడుకు చెందిన బాధితులు వాపోతు న్నారు. నూజివీడు కేంద్రంగా గత ఆరేళ్లుగా రైస్ పులింగ్ వ్యవ హారంలో నూజివీడుకు చెందిన వేపాని ప్రసన్నకుమార్, దాచేపల్లి శ్రీనివాసరావు మాటలు నమ్మి తమ ఆస్తులను సైతం ఫణంగా పెట్టి పెట్టుబడులు పెట్టామని తమ్మిశెట్టి శ్రీనివాసరావు, ఆరేపల్లి రవి, తదితరులు గురువారం విలేకరుల సమావేశంలో వాపో యారు. 2019 నుంచి రైస్ పుల్లింగ్‌లో పెట్టుబడులు పెడితే కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని తమను నమ్మించారని, దాదాపు 17 మంది రూ.రెండున్నర కోట్లు వరకు విడతల వారీగా పెట్టుబడులు పెట్టారన్నారు. కేవలం పది రోజుల్లో పెట్టిన పెట్టు బడులకు ఐదు రెట్లు డబ్బు ఇస్తామన్నవారు కాలయాపన చేస్తూ రావడంతో నిలదీయగా ప్రతీసారి కంటైనర్‌లో డబ్బు వస్తోందని, రైస్ పుల్లింగ్ ద్వారా తయారైన ఇంధనం నాసా ఇంజనీర్లు తనిఖీ చేశారని, 24 గంటల్లో మీ డబ్బు వస్తుందంటూ నమ్మించార న్నారు. నూజివీడులోని ప్రముఖ హోటల్‌లో అపార్ట్‌మెంట్లు కొనుగోలు చేస్తున్నట్టు నమ్మించే ప్రయత్నంలో బేరాలు సైతం చేశారన్నారు. ఈ రైస్ పులింగ్ వ్యవహారంలో చిక్కుకుని మనోవ్యథతో ముగ్గురు మృతి చెందారని, సంబంధిత కుటుంబ సభ్యులు అప్పులు తీర్చలేక అవస్థలు పడుతున్నారన్నారు. దీనిపై 20 రోజుల క్రితం నూజివీడు పోలీసులను ఆశ్రయించామని, నేటికీ కేసు నమోదు చేయలేదన్నారు. దీనిపై నూజివీడు పట్టణ సీఐ సత్యశ్రీనివాస్‌ను వివరణ కోరగా బాధితుల ఫిర్యాదు అందిం దని, నిందితుడు దాచేపల్లి శ్రీనివాస్‌రావు మూడో తేదీన వచ్చి సమస్య పరిష్కరించుకుంటానని చెప్పినట్టు తెలిపారు.