Share News

మూతపడిన రైస్‌ మిల్లులు

ABN , Publish Date - Feb 26 , 2026 | 12:45 AM

రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫోర్టిఫైడ్‌ రైస్‌ కెన్నెల్‌ సరఫరా నిలిచిపోవడంతో రైస్‌ మిల్లులు మూతపడ్డాయి. రేషన్‌ బియ్యంలో పోషక విలువలు పెరగాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం కెన్నల్‌ను కలుపుతోంది.

మూతపడిన రైస్‌ మిల్లులు

900 టన్నుల కెన్నల్‌ సరఫరాలో అంతరాయం..

భీమవరం, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి):రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫోర్టిఫైడ్‌ రైస్‌ కెన్నెల్‌ సరఫరా నిలిచిపోవడంతో రైస్‌ మిల్లులు మూతపడ్డాయి. రేషన్‌ బియ్యంలో పోషక విలువలు పెరగాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం కెన్నల్‌ను కలుపుతోంది. ప్రభుత్వం అప్పగించిన ధాన్యాన్ని మరాడించిన తర్వాత కెన్నెల్‌ను కలిపిన బియ్యాన్ని మిల్లర్లు తిరిగి ప్రభుత్వానికి అప్పగిస్తున్నారు. జిల్లాలో మిల్లర్లు 90 వేల టన్నుల బియ్యాన్ని ప్రభుత్వా నికి అప్పగించాలి. గడిచిన ఖరీఫ్‌లో ప్రభుత్వం జిల్లా రైతుల నుంచి 4.40 లక్షల టన్నుల ధాన్యా న్ని కొనుగోలు చేసి మిల్లర్లకు అప్పగించింది. ఇప్పటి వరకు జిల్లా రైస్‌ మిల్లర్లు ఎఫ్‌సీఐకు 1.24 లక్షల టన్నులు, రాష్ట్ర ప్రభుత్వానికి 65 వేల టన్నులు అప్పగించారు. మరో 90 వేల టన్నులు ఇవ్వాలి. కెన్నల్‌ సరఫరా లేకపోవడం తో బియ్యాన్ని అప్పగించే పరిస్థితిలేదు. ఈ కార ణంగా ధాన్యం మరాడించడం లేదు. క్వింటాలు కు కిలో వంతున కెన్నల్‌ కలపాలి. ఇప్పటి వరకు కాంట్రాక్టర్‌ సరఫరా చేసే కెన్నెల్‌ను ఓ ప్రయోగశాలలో పరీక్షించేవారు. అక్కడ అను మతి వచ్చిందంటే మిల్లులకు పంపేవారు. ప్రభు త్వం ఈసారి ప్రయోగశాల ఎంపికలో నిబంధన లను మార్చింది. రేండమ్‌గా ఏదో ఒక ప్రయోగ శాలకు అప్పగించడంతో పరీక్ష ఫలితాలు ఆలస్యం అవుతున్నాయి. జిల్లాలో 900 టన్నుల సరఫరా అయితేనే మిల్లులు పూర్తిస్థాయిలో బియ్యాన్ని అప్పగించ నున్నాయి. మరోవైపు జిల్లాలోని ధాన్యం నిల్వలు, బియ్యం అప్పగింత వంటి వివరాలు పరిశీలించేందుకు అధికారులు బుధవారం జిల్లావ్యాప్తంగా 30 మిల్లుల్లో తనిఖీలు చేపట్టారు.

Updated Date - Feb 26 , 2026 | 12:45 AM