మిల్లర్ల పరేషాన్.. !
ABN , Publish Date - May 10 , 2026 | 12:20 AM
రాష్ట్ర ప్రభుత్వం పేదలకు పది శాతం నూకతో మరింత నాణ్యమైన రేషన్ బియ్యం పంపిణీ చేయా లనే నిర్ణయం మిల్లర్లకు ఇబ్బందులు తెస్తోంది. బి య్యం సేకరణలో జాప్యం కారణంగా మిల్లర్లు ధాన్యం నిల్వ చేసేందుకు అవస్థలు పడుతున్నారు.
రేషన్‌లో పది శాతం నూకతో బియ్యం సరఫరా
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం.. మిల్లర్ల నుంచి తీసుకోవడంలో జాప్యం
మిల్లుల వద్ద పేరుకుపోతున్న ధాన్యం నిల్వలు.. గోదాముల కోసం తంటాలు
(భీమవరం–ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం పేదలకు పది శాతం నూకతో మరింత నాణ్యమైన రేషన్ బియ్యం పంపిణీ చేయా లనే నిర్ణయం మిల్లర్లకు ఇబ్బందులు తెస్తోంది. బి య్యం సేకరణలో జాప్యం కారణంగా మిల్లర్లు ధాన్యం నిల్వ చేసేందుకు అవస్థలు పడుతున్నారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయాలు వేగంగా తీసుకోవాలి. ఇప్పటి వరకు 15 శాతం నూకతో పంపిణీ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పది శాతం నూక విధానాన్ని అమలు చేస్తోంది. నూక నుంచి ఇథనాల్ ఉత్పత్తి చేసేందుకు కేంద్రం బియ్యంలో నూక శాతాన్ని తగ్గించింది. మిల్లుల నుంచి నూకను కొనుగోలు చేస్తోంది. అదే పంథాలో రాష్ట్ర ప్రభుత్వం పది శాతం నూకతోనే బియ్యం తీసుకోనుంది. ఈ క్రమంలో మిల్లర్ల నుంచి బియ్యం సేకరణలో జాప్యం జరుగుతుండడంతో మిల్లర్ల వద్ద ధాన్యం నిల్వలు పేరుకుపోతున్నాయి. వీటిని నిల్వ చేసేందుకు నానాతంటాలు పడుతు న్నారు. ఆరు బయట వుంటే అకాల వర్షాలకు ధాన్యం బస్తాలు తడిసిపోయే ప్రమాదం ఉందన్న ఆందోళనతో ప్రైవేటు గోదాముల కోసం ఎగబడుతున్నారు. వాస్తవా నికి మిల్లర్లు ముందుగానే ప్రభుత్వానికి హెచ్చరిం చారు. బియ్యం త్వరితగతిన తీసుకుంటేనే సంచులకు ఇబ్బంది ఉండదని, సకాలంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయవచ్చని స్పష్టం చేశారు.
జిల్లాలో సేకరణ ఇలా..
జిల్లాలో ఎనిమిది లక్షల టన్నుల ధాన్యం కొనుగో లుకు ప్రణాళిక చేశారు. ఇప్పటి వరకు 5.80 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. మరో 2.20 లక్షల టన్నులు కొనుగోలు చేయాలి. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు పంపే శారు. మిల్లుల నుంచి బియ్యం సేకరిస్తేనే మళ్లీ ధాన్యం నిల్వ చేసుకోవడానికి అర్హత సాధిస్తారు. ఎందుకంటే తక్కువ మొత్తంలోనే బ్యాంకు గ్యారంటీలు ఇస్తారు. ఆ మేరకు బియ్యం అప్పగిస్తుంటే మళ్లీ ధాన్యం లక్ష్యానికి అర్హత సాధిస్తుంటారు. ఉదాహరణకు జిల్లాలో ఒక మిల్లరు 30 వేల టన్నుల ధాన్యానికి అర్హత ఉంటే ముందుగా 15 వేల టన్నులకే బ్యాంకు గ్యారంటీ ఇస్తారు. ఆ మేరకే ప్రభుత్వం మిల్లుకు ధాన్యం ఇస్తుంది. మిల్లర్లకు 15 వేల వరకే అర్హత ఉంటుంది. తమ వద్దకు వచ్చిన ధాన్యాన్ని మరాడించి ప్రభుత్వానికి బియ్యం అప్పగిస్తే మళ్లీ బ్యాంకు గ్యారంటీ లభిస్తుంది. దాని ఆధారంగా మిగిలిన లక్ష్యాన్ని చేరుకుంటారు. ఇప్పటి వరకు అదే పద్ధతిలో మిల్లర్లు ముందుకు వెళుతున్నారు.
ఈసారి బియ్యం సేకరణలో జాప్యం
ఈసారి బియ్యం సేకరణలో జాప్యం జరిగింది. ఆ ప్రభావం సంచులపైన, బ్యాంకు గ్యారంటీలపైన పడ నుంది. జిల్లాకు అవసరమైన రెండు కోట్ల సంచులను మిల్లర్లకు ముందుగానే సరఫరా చేశారు. దీంతో అధికారులు కాస్త ధీమాగా ఉన్నారు. ఎటొచ్చి బ్యాంకు గ్యారంటీలతోనే సమస్య ఏర్పడనుందని మిల్లర్లు ఆందోళన చెందుతున్నారు. మిల్లర్ల నుంచి ప్రభుత్వం 4.75 లక్షల టన్నుల బియ్యాన్ని తీసుకోవాలి. ఇందులో ఎఫ్‌సీఐకి రెండు రోజుల్లో 30 వేల టన్నులు ఇవ్వను న్నారు. మిగిలిన 4.45 లక్షల టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక్కడే జాప్యం జరుగు తోంది. దీనిని వేగవంతం చేయాల్సి వుంది.