Share News

133 సమస్యలు పరిష్కారం

ABN , Publish Date - May 30 , 2026 | 12:47 AM

వేగవంతమైన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుందని కలెక్టర్‌ నాగరాణి అన్నారు.

133 సమస్యలు పరిష్కారం
సమస్యలు వింటున్న కలెక్టర్‌ నాగరాణి, ఎమ్మెల్యే పితాని తదితరులు

ఆచంట నియోజకవర్గ ప్రత్యేక పీజీఆర్‌ఎస్‌లో 795 అర్జీలు

వాసవి పెనుగొండలో కలెక్టర్‌ నాగరాణి

వాసవి పెనుగొండ, మే 29(ఆంధ్రజ్యోతి): వేగవంతమైన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుందని కలెక్టర్‌ నాగరాణి అన్నారు. శుక్రవారం వాసవి పెనుగొండ ఎస్‌వీకేపీ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన ప్రత్యేక పీజీఆర్‌ఎస్‌ లో ఆమె మాట్లాడారు. ‘నియోజకవర్గంలో నాలుగు శుక్రవారాలు ప్రత్యేక పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమాల్లో భాగంగా ఇప్పటికే ఆచంటలో 15, 22 తేదీల్లో నిర్వహించి 431 అర్జీలను స్వీకరించాం. పెనుగొండ సదస్సులో 354తో కలిపి మొత్తం 795 అర్జీలు వచ్చాయి. వీటిల్లో 133 అర్జీలను పరిష్కరించాం. మిగిలినవి పరిష్కార దశల్లో ఉన్నా యి’ అని తెలిపారు. ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు తీసుకొన్న విప్లవాత్మకమైన నిర్ణయాలతో ప్రత్యేక పీజీఆర్‌ఎస్‌ ఒకటన్నారు. నూటికి 70–80 శాతం అర్జీలు పెన్షన్లు, ఇళ్ల స్థలాల కోసమే వస్తున్నాయన్నారు. పీజీఆర్‌ఎస్‌కు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను విన్నవించారు. ఆర్‌డీవో దాసిరాజు, ప్రత్యేకాధికారి జి. పిచ్చయ్య, పీజీఆర్‌ఎస్‌ నోడల్‌ అధికారి దోసిరెడి ్డ తదితరులు పాల్గొన్నారు.

పనుల్లో జాప్యం వద్దు

భీమవరం టౌన్‌, మే 29(ఆంధ్రజ్యోతి):నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళికలో ప్రతి పనిని నిర్ధిష్ట కాల పరిమితిలోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ నాగరాణి ప్రత్యేకాధికారులను ఆదేశించారు. క్యాంపు కార్యాలయం నుంచి శుక్రవారం కలెక్టర్‌ నియోజకవర్గ ప్రత్యేకాధికారులు, సంబంధిత శాఖల ఎగ్జిక్యూటివ్‌ ఏజెన్సీలతో జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. సీఎస్‌ఆర్‌ నిధుల ద్వారా చేపడుతున్న వైద్య పరికరాల ఏర్పాటు, కమ్యూ నిటీ హాల్స్‌ నిర్మాణం, రోడ్లు, డ్రెయిన్లు తదితర మౌలిక వసతుల అభివృద్ధి పనుల్లో జాప్యం లేకుండా చూడాలన్నారు. సీపీవో కె.శివపార్వతి, సహాయ సంచాలకులు శ్రీనివాసరావు, నియోజకవర్గ ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 30 , 2026 | 12:47 AM