Share News

పీజీఆర్‌ఎస్‌లో 145 దరఖాస్తులు

ABN , Publish Date - May 26 , 2026 | 12:16 AM

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి అర్జీని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్‌ చదలవాడ నాగరాణి ఆదేశించారు.

పీజీఆర్‌ఎస్‌లో 145 దరఖాస్తులు
వృద్ధుల సమస్య తెలుసుకుంటున్న కలెక్టర్‌

భీమవరం టౌన్‌, మే 25(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి అర్జీని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్‌ చదలవాడ నాగరాణి ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమ వారం నిర్వహించిన ప్రజా సమస్యల పరి ష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌), రెవెన్యూ క్లినిక్‌లో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. పీజీ ఆర్‌ఎస్‌లో 145, రెవెన్యూ క్లినిక్‌లో 45 అర్జీలు స్వీకరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి అర్జీని నిర్ణీత గడువులోగా పరిష్కరించాల న్నారు. జేసీ టి.రాహుల్‌కుమార్‌ రెడ్డి, డీఆర్వో బి.శివన్నారాయణ రెడ్డి, డీపీవో వై.దోసిరెడ్డి, డ్వామా పీడీ కేసీహెచ్‌.అప్పారావు, ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.

ప్రజా ఫిర్యాదులపై అలసత్వం వద్దు : ఎస్పీ

భీమవరం క్రైం, మే 25(ఆంధ్రజ్యోతి): ప్రజా ఫిర్యాదులపై అలసత్వం తగదని, బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూ డాలని ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో ఎస్పీ స్వయంగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. సంబంధిత స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లతో ఎస్పీ ఫోన్‌లో మాట్లాడి, బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు. జిల్లా నలుమూలల నుంచి మొత్తం 18 అర్జీలు వచ్చాయి.

Updated Date - May 26 , 2026 | 12:16 AM