పీజీఆర్‌ఎస్‌పై ప్రత్యేక దృష్టి
ABN , Publish Date - Jan 20 , 2026 | 12:30 AM
పీజీఆర్‌ఎస్‌లో అందిన అర్జీలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు.
సమస్యలు పరిష్కరించాలని అధికారులకు
కలెక్టర్ నాగరాణి, ఎస్పీ నయీం ఆదేశాలు
ఫిర్యాదులు స్వీకరణ
భీమవరం టౌన్, జనవరి 19(ఆంధ్రజ్యోతి): పీజీఆర్‌ఎస్‌లో అందిన అర్జీలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. ప్రధాన సమస్యల పరిష్కా రానికి వెబ్ ఎక్స్ ద్వారా ఆర్డీవోలు, తహసీల్దార్లతో కలెక్టర్ మాట్లాడారు. సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 139 అర్జీలు స్వీకరించారు.
వివిధ ప్రాంతాల నుంచి కలెక్టరేట్‌కు చేరుకున్న దివ్యాంగుల వద్దకు కలెక్టర్ స్వయంగా వెళ్లి పలకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ‘దివ్యాంగ త్వం లెక్కింపునకు కొన్ని పరీక్షలు జిల్లాలో చేయ డం లేదు. విజయవాడ, గుంటూరు జిల్లాలకు వెళ్లి నా పట్టించుకోవడం లేదు’ అని కొందరు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దివ్యాంగత్వం లెక్కింపు పరీ క్షలకు స్లాట్ తీసుకుని.. జిల్లా నుంచి ఒక వాహ నంలో పంపించి చేయించాలని డీసీహెచ్‌ఎస్, డీఆర్డీఏ పీడీలను ఆదేశించారు. కౌంటర్లను సంద చి ఫిర్యాదులను కలెక్టర్, జేసీలు పరిశీలించారు.
రెవెన్యూ క్లినిక్‌లో భూసమస్యలపై వచ్చిన 54 దరఖాస్తుల పరిష్కారానికి సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జేసీ రాహుల్ కుమార్‌రెడ్డి, డీఆర్వో శివన్నారాయణరెడ్డి, జిల్లా స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు అధికారి వై.దోసిరెడ్డి, డ్వామా పీడీ అప్పారావు, కలెక్టరేట్ పరిపాలన అధికారి ఎన్.వెంకటేశ్వరరావు ఫిర్యాదులు స్వీకరించారు.
కలెక్టరేట్‌లో యోగి వేమన జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వేమన చిత్రపటానికి కలెక్టర్ నాగరాణి, జేసీ రాహుల్‌కుమార్‌రెడ్డి, డీఆర్వో తదిత రులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఎస్పీ 13 అర్జీల స్వీకరణ
భీమవరం క్రైం, జనవరి 19(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తూ అర్జీలు పునరావృతం కాకుండా నిర్ణీత గడువులోగా శాశ్వత పరిష్కారం చూపాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం భీమవరం వన్‌టౌన్ స్టేషన్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు వివిధ రకాల సమస్యలతో వచ్చిన ప్రజల నుంచి 13 అర్జీలను స్వీకరించారు.
పీజీఆర్‌ఎస్ కాల్ సెంటర్ 1100
జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణతోపాటు ప్రజలకు మరింత జవాబుదారీతనంతో కూడిన పారదర్శకమైన, వేగవంతమైన పోలీసు సేవలను అందిం చడమే ప్రధాన లక్ష్యంగా జిల్లా పోలీస్ యంత్రాం గం పని చేస్తోందని ఎస్పీ నయీం అస్మి తెలిపారు. వన్‌టౌన్ స్టేషన్‌లో పీజీఆర్‌ఎస్ కాల్ సెంటర్– 1100’ సేవల సమాచార బ్రోచర్‌ను ఎస్పీ ఆవిష్కరించి, మాట్లాడారు. ప్రజల ఫిర్యాదులను సులభంగా నమో దు చేసి, వాటిపై తక్షణ చర్యలు చేపట్టేందుకు ఈ 1100 కాల్ సెంటర్ ఒక ప్రభావవంతమైన వేదికగా ఉపయోగపడుతుందన్నారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, నేరుగా ఈ నెంబర్ ద్వారా తమ గోడును వినిపించవచ్చని తెలిపారు. ఈ ఫిర్యాదులపై పోలీస్ ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఏఎస్పీ వి.భీమారావు, డీఎస్పీ రఘువీర్ విష్ణు, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ కేవీవీఎన్ సత్యనారాయణ పాల్గొన్నారు.