Share News

జోరందుకున్న ప్రయాణాలు

ABN , Publish Date - Jan 18 , 2026 | 12:14 AM

పండుగ ముగియడంతో శనివారం ఉదయం నుంచి ఆర్టీసీ బస్సు ప్రయాణాలు జోరందుకున్నాయి. శుక్రవారం అంతంత మాత్రంగా ఉన్న రద్దీ.. ఒక్కసారిగా శని వారం పెరగడంతో ఆర్టీసీ అధికారులు సర్వీసులను పెంచి నడిపారు.

జోరందుకున్న ప్రయాణాలు
ఏలూరు కొత్త బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీ

విజయవాడ, హైదరాబాద్‌లకు ఆర్టీసీ సర్వీసులు పెంపు

ఏలూరు/పెదపాడు, జనవరి 17 (ఆంధ్ర జ్యోతి): పండుగ ముగియడంతో శనివారం ఉదయం నుంచి ఆర్టీసీ బస్సు ప్రయాణాలు జోరందుకున్నాయి. శుక్రవారం అంతంత మాత్రంగా ఉన్న రద్దీ.. ఒక్కసారిగా శని వారం పెరగడంతో ఆర్టీసీ అధికారులు సర్వీసులను పెంచి నడిపారు. హైదరా బాద్‌కు శుక్రవారం మొత్తం 16 బస్సులను నడపగా శనివారం నాటికి వీటి సంఖ్యను 20కి పెంచారు. విజయ వాడకు కనుమ రోజు 10 బస్సులు తిరగ్గా వాటిని 20కి పెంచారు. ఇక ఉచిత బస్సులు మహిళా ప్రయాణికులు, కుటుంబసభ్యుల రద్దీతో ఏలూరు కొత్త బస్టాండ్‌, పాతబస్టాండ్‌లు కిటకిటలాడాయి. రైల్వే స్టేషన్‌లోను ప్రయాణికుల రద్దీ నెలకొంది. ప్రధానంగా ఆదివారం అమావాస్య కావడంతో ముందస్తుగానే తిరుగుముఖం పట్టారు. పయాణికులకు ఇక్కట్లు కలగకుండా ఏలూరు కొత్తబస్టాండ్‌, పాతబస్టాండ్‌ల్లో ఆర్టీసీ సూపర్‌వైజర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు డీపీటీవో షేక్‌ షబ్నం తెలిపారు. జాతీయ రహదారిపై కార్ల రద్దీ ఉన్నప్పటికీ పెదపాడు మండలం కలపర్రు వద్ద వున్న టోల్‌గేట్‌ వద్ద సాధారణ రద్దీనే కన్పిస్తోంది. టోల్‌ వసూళ్లలో ఫాస్టాగ్‌ వసూళ్లు వేగవంతంగా ఉండడం, వాహనాలు వెళ్లేందుకు అన్ని క్యూలైన్లను టోల్‌ సిబ్బంది వినియోగంలోకి తీసుకువచ్చారు.

Updated Date - Jan 18 , 2026 | 12:14 AM