Share News

లెక్క తేలింది!

ABN , Publish Date - Oct 10 , 2026 | 11:57 PM

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర క్యాబినేట్‌ శనివారం నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలలో బలహీన వర్గాలకు సముచిత రాజకీయ ప్రాతినిధ్యం, సామాజిక న్యాయం కల్పించ డమే కూటమి ప్రభుత్వ ధ్యేయంగా పేర్కొం ది.

 లెక్క తేలింది!

స్థానిక సంస్థలలో బీసీలకు రిజర్వేషన్లు ఖరారు

త్వరలోనే రిజర్వేషన్‌ జీవోలు విడుదల

స్థానిక సమరానికి అంతా సమాయత్తం

(ఏలూరుసిటీ–ఆంధ్రజ్యోతి):

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర క్యాబినేట్‌ శనివారం నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలలో బలహీన వర్గాలకు సముచిత రాజకీయ ప్రాతినిధ్యం, సామాజిక న్యాయం కల్పించ డమే కూటమి ప్రభుత్వ ధ్యేయంగా పేర్కొం ది. బీసీలకు రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్ల కల్పనతో పాటు చట్టపరమైన పరిమితులకు లోబడి వారికి రాజకీయంగా మరిన్ని అవకాశాలు కల్పించేందుకు కట్టుబడి ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకా లకు అనుగుణంగా ప్రత్యేక కమిషన్‌ను 2026 ఫిబ్రవరి 19న జారీ చేసిన జీవో నంబరు 3 ద్వారా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి రాజీవ్‌ రంజన్‌మిశ్రా నేతృత్వంలో ఏర్పాటు చేశారు. ఈ కమిషన్‌ రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాలు, జిల్లాలు, సామాజిక వర్గాల నుంచి సమాచారం సేకరించి స్థానిక సంస్థల వారీగా బీసీల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు నివేదిక సమర్పించింది. కమిషన్‌ సిఫార్సులను పరిశీలిం చిన అనంతరం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ కమిషన్‌ సిఫార్సుల మేరకు స్థానిక సంస్థల స్వభావాన్ని బట్టి వేర్వేరు యూనిట్లును ప్రాతిపదికగా తీసుకుని రిజర్వేషన్లను నిర్ణయించారు. పంచాయతీ వార్డు సభ్యులకు గ్రామ పంచాయతీని, సర్పంచ్‌ పదవు లకు మండల పరిధిలోని గ్రామ పంచాయతీలను, ఎంపీటీసీ పదవులకు సంబంధిత ప్రాతీయ యూనిట్‌ ను, జడ్పీటీసీ , జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవులకు నిర్ధే శిత జిల్లా లేదా రాష్ట్ర స్థాయి యూనిట్లను పరిగణలోకి తీసుకున్నారు. పట్టణ స్థానిక సంస్థల్లో వార్డు సభ్యులు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌లు, మేయర్లకు సంబంధిత యూనిట్లు ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేశారు.

స్థానిక సంస్థల వారీగా బీసీల రిజర్వేషన్లు

ప్రత్యేక కమిషన్‌ నివేదిక ప్రకారం బీసీలకు ప్రతిపాదించిన రిజర్వేషన్లు వివరాలు ఇలా ఉన్నాయి, పంచాయతీ వార్డు సభ్యులకు 26.73 శాతం, సర్పంచ్‌లకు 27.95 శాతం, ఎంపీటీసీలకు 25.55 శాతం, ఎంపీపీలకు 24.60 శాతం, జడ్పీటీసీలకు 24.60 శాతం, జిల్లా పరిషత్‌ చైర్మన్‌లకు 23.08 శాతం, పట్టణ స్థానిక సంస్థల వార్డు సభ్యులకు 32.78 శాతం, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌లకు 33.02 శాతం, మేయర్లకు 35.29 శాతం రిజర్వేషన్లు ప్రతిపాదించారు. ఈ గణాంకాల ప్రకారం స్థానిక సంస్థలన్నింటినీ కలిపి బీసీలకు 28.18 శాతం రిజర్వేషన్లు లభించనున్నాయని ప్రభుత్వం పేర్కొంది.

50 శాతం మించకుండా రిజర్వేషన్లు

సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం రిజర్వేషన్లను 50 శాతానికి మించకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రిజర్వేషన్లు ఖరారు చేసే అవకాశాలున్నాయి. బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా ఇంకా స్థానిక సంస్థలకు సంబంధించి రిజర్వేషన్లు చేయడానికి జీవో విడుదల కావాల్సి ఉంది. రిజర్వేషన్లు జీవో విడుదల కాగానే పంచాయతీలు, జిల్లా పరిషత్‌లు, మున్సిపాల్టీలో రిజర్వేషన్లు ప్రకటించే అవకాశాలున్నా యి. ఏలూరు జిల్లాకు సంబంధించి 543 పంచా యతీలు, 27 మండల పరిషత్‌లు, 454 ఎంపీటీసీలు, 27 జడ్పీటీసీలు, ఒక జిల్లా పరిషత్‌ ఉన్నాయి. వీటికి సంబంధించి ఎస్టీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయాల్సి ఉంది. పంచాయతీల్లో వార్డు సభ్యులు, సర్పంచ్‌లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తి కాగానే స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూలు విడుదల చేసే అవకాశాలు న్నాయి. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా, బ్యాలెట్‌ బాక్సులు, పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు ప్రక్రియ పూర్తికాగా ఎన్నికల అధికారులు, సిబ్బంది నియామకా లు చేయాల్సి ఉంది. నవంబరు 15లోగా అన్ని స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది.

Updated Date - Oct 10 , 2026 | 11:57 PM