Share News

వడ్డీ పిడుగు..

ABN , Publish Date - Oct 09 , 2026 | 12:00 AM

రిజర్వ్‌ బ్యాంకు రెపో రేటు పెంపుతో ప్రజలపై వడ్డీ పిడుగు పడింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వాసులపై నెలకు రూ.16.68 కోట్ల మేర అదనపు భారం పడనుంది. నాలుగేళ్ల తరువాత ఆర్‌బీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

 వడ్డీ పిడుగు..
REPO RATE

వడ్డీ పిడుగు..

రెపో రేటు పెంపుతో ఉమ్మడి జిల్లాలో నెలకు రూ.16.68 కోట్ల భారం

రిజర్వ్‌ బ్యాంకు రెపో రేటు పెంపుతో ప్రజలపై వడ్డీ పిడుగు పడింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వాసులపై నెలకు రూ.16.68 కోట్ల మేర అదనపు భారం పడనుంది. నాలుగేళ్ల తరువాత ఆర్‌బీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ(ఎంపీసీ) బుఽధవారం సమావేశమై రెపో రేటును 0.25 శాతం పెంచుతూ నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న 5.25 శాతం నుంచి 5.50 శాతానికి పెంచింది. ద్రవ్యోల్బణం 4.8శాతానికి పెరగడమే ఈ పెంపునకు కారణమని ఆర్‌బీఐ వాదన..

–పాలకొల్లు,(ఆంధ్రజ్యోతి)

పశ్చిమ గోదావరి జిల్లాలో రుణాలు..

ఈ ఏడాది జూన్‌ 30 నాటికి జిల్లాలో మొత్తం బ్యాంకు రుణాలు రూ.45,031.70 కోట్లుగా ఉన్నాయి. ఇందులో సింహభాగం వ్యవసాయ రంగానిదే.. ఒక్క వ్యవసాయ రంగంలోనే రూ.20,778.44 కోట్లు రుణాలు ఉన్నాయి. పెరిగిన వడ్డీ రేటుతో జిల్లాలోని రుణ గ్రహీతలపై నెలకు రూ.9.38 కోట్లు అదనపు వడ్డీ భారం పడనుంది.

రంగాల వారీగా

వ్యవసాయం–రూ.20,778.44 కోట్లు, ఎం.ఎస్‌.ఎం.ఈ.– రూ.7,790.35 కోట్లు, ఇతర ప్రాధాన్యతా రంగం– రూ.2,896.91 కోట్లు, గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు రూ.13,566.00 కోట్లుగా ఉన్నాయి.

ఈఎంఐల జోలికెళ్తే మోతే..

రెపో రేటు పెంపుతో బ్యాంకులు వెంటనే ఎంసీఎల్‌ ఆర్‌, ఈబీఎల్‌ఆర్‌ రేట్లను పెంచనున్నాయి. ఇప్పటికే రు ణాలున్నవారికి, కొత్తగా రుణం తీసుకునే వారికి నెల వారీ వాయిదా(ఈఎంఐ) పెరగనుంది. ఉదాహరణకు రూ.30 లక్షల గృహ రుణంపై 20 ఏళ్ల కాలానికి నెలకు సుమారు రూ.450 అదనంగా చెల్లించాల్సి వస్తోంది. అధిక రుణాలు వ్యవసాయ రంగంలోనే ఉండటంతో రైతులపై ఏటా రూ.52 కోట్లు, ఎం.ఎస్‌.ఎం.ఈ.లపై ఏటా రూ.19.47 కోట్ల అదనపు భారం పడనుంది. పెరిగిన రెపో రేటు 0.25శాతం చిన్నగా కనిపించినా జిల్లా వాసు లపై ఏటా రూ.112 కోట్లుకు పైగా అదనపు భారం పడనుంది. ఇప్పటికే వ్యాపారాలు కుదేలయ్యాయని, ఉద్యోగులకు పేరివిజన్‌, ఇంక్రిమెంట్లు లేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో వడ్డీ పెంపు పెనుభారంగా మారనుందని రుణ గ్రహీతలు వాపోతున్నారు.

ఏలూరు జిల్లాలో నెలకు రూ.7.30 కోట్లు..

ఈ ఏడాది జూన్‌ 30వ తేదీ నాటికి మొత్తం బ్యాంకు రుణాలు రూ.35,040.71 కోట్లకు చేరాయి. ఇందులో వ్య వసాయానికి రూ.19,839.35 కోట్లు, ఎంఎస్‌ఎంఈలకు రూ.3,260.15 కోట్లు, సహ ప్రాధాన్యతా రంగానికి రూ.25,289.49 కోట్లు,గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు రూ.9,751.22 కోట్లు అందజేశారు.ఈ వడ్డీ రేటుతో రుణ గ్రహీతలపై నెలకు రూ.7.30 కోట్లు, ఏడాదికి రూ.87.60 కోట్ల మేర అదనపు వడ్డీ భారం పడనుంది.

ఆయా బ్యాంకుల మార్గదర్శకాలను బట్టి సవరిస్తారు..

ఎం.వి.జాన్‌ మార్టిన్‌, పశ్చిమ గోదావరి జిల్లా లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌

రిజర్వు బ్యాంకు సూచనల మేరకు ఆయా బ్యాంకుల అంతర్గత విధానాలకు అనుగుణంగా వడ్డీ రేట్ల సవరణ ఉంటుంది. ఆర్‌బీఐ రెపో రేటు పెంపు నేపథ్యంలో ఆయా బ్యాంకుల హెడ్‌ ఆఫీసుల నుంచి మార్గదర్శకాలు వస్తాయి. వాటికి అనుగుణంగా ఎంసీఎల్‌.ఆర్‌., ఈబీఎల్‌ఆర్‌ రేట్లను సవరిస్తారు.

ద్రవ్యోల్బణ నియంత్రణతో ధీర్ఘకాలిక ప్రయోజనం

కె.సత్యనారాయణ, ఏలూరు జిల్లా లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌

ఆర్‌.బి.ఐ. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి రెపో రేటును పెంచారు. రుణాలపై భారం పడినా, పెరుగుతున్న వస్తువుల ధరలను(ద్రవ్యోల్బణం) అదుపుచేయడానికి ఆర్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయం ధీర్ఘకాలంలో జిల్లా మార్కెట్లలో కొనుగోలు శక్తిని కాపాడుతుంది. వడ్డీరేట్లు పెరిగే క్రమంలో బ్యాంకులు ఫిక్సిడ్‌ డిపాజిట్ల(ఎఫ్‌డీ)పై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు వస్తాయి. పొదుపుదారులు, సీనియర్‌ సిటిజన్స్‌కు ప్రయోజనం ఉంటుంది. రుణాల్లో 56 శాతానికి పైగా వ్యవసాయ రంగానికే ఇచ్చాం.

షేక్‌ చేస్తున్న షేర్‌ మార్కెట్‌..

నరసాపురం:అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ ఆర్థిక మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అమెరికా, ఇజ్రాయిల్‌– ఇరాన్‌, రష్యా, ఉక్రెయిన్‌, గల్ఫ్‌ దేశాల్లోని అనిశ్చితిలోకి మార్కెట్‌ను కుంగదీస్తున్నాయి. పెరుగుతున్న క్రూడ్‌ ధరలు ద్రవ్యోల్బణ భయాలకు దారి తీశాయి. రవాణా వ్యయాలు పెరగడంతో నిత్యావరాల ధరలు కొండెక్కాయి. ఎల్‌నినో ప్రభావం వీటికి తోడవ్వడంతో ఆర్థిక భయాలు మరింత పెరిగాయి. ఈ కారణాలతో మార్కెట్లలో డౌన్‌ ట్రేండ్‌ నెలకొంది. వరుసగా పతనాలతో పెట్టుబడిదా రుల సంపద రోజురోజుకు ఆవిరైపోతోంది. ఈ పరిణా మాల నేపథ్యంలో బుధవారం వడ్డీ రేట్లను పెంచడంతో ఆ ప్రభావం స్టాక్‌ మార్కెట్‌పై చూపింది. రెండ్రోజు లుగా మార్కెట్‌ డౌన్‌ ట్రెండ్‌లో ఉండగా గురువారం మార్కెట్‌ భారీగా పతనమైంది. దీంతో ఉమ్మడి జిల్లాల్లో మదుపుదారులు తీవ్రంగా నష్టపోయారు. గతంలో పసిడి, వెండి ధరలు భారీగా పెరగడంతో మదుపుదారులు వీటిపై పెట్టుబడులు పెట్టారు. జనవరి నుంచి డౌన్‌ ట్రెండ్‌ కొనసాగడంతో పెట్టుబడిదారులు టెన్షన్‌ పడుతున్నా రు. అప్పులు తెచ్చి మరీ కొనుగోలు చేశారు. ప్రస్తుతం వీటి ధరలు నిలకడగా ఉండటంతో వడ్డీలు కట్టలేక టెన్షన్‌ పడుతున్నారు. అమ్ముదామంటే గ్రాముకు రూ.3 నుంచి 4వేలు తగ్గింది. ఇటు వెండి కూడా రూ.1.50 లక్షల వరకు క్షిణించింది. పసిడి, వెండి ధరల పత నంతో ఉమ్మడి జిల్లాలో దాదాపు రూ100 కోట్లుపైనే నష్ట పోయి ఉంటారని అంచన వేస్తున్నారు. అంతర్జాతీ యంగా నెలకొన్న పరిస్థితులు ఎప్పుడు సాధారణ స్థితికి వస్తాయోనని పెట్టుబడిదారులంతా ఎదురుచూస్తున్నారు.

Updated Date - Oct 09 , 2026 | 12:00 AM