Share News

ఫెయిల్డ్‌ విద్యార్థులు రెమిడియల్‌ క్లాసులకు రావాలి

ABN , Publish Date - May 13 , 2026 | 12:22 AM

పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులను అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు నిర్వహిస్తోన్న రెమిడియల్‌ క్లాసులను మంగళవారం కలెక్టర్‌ వెట్రిసెల్వి ఆకస్మిక తనిఖీ చేశారు.

ఫెయిల్డ్‌ విద్యార్థులు  రెమిడియల్‌ క్లాసులకు రావాలి
రెమిడియల్‌ క్లాసులను పరిశీలిస్తున్న కలెక్టర్‌ వెట్రిసెల్వి

తల్లిదండ్రులకు కలెక్టర్‌ వెట్రిసెల్వి ఫోన్‌

ఏలూరు అర్బన్‌, మే 12(ఆంధ్రజ్యోతి): పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులను అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు నిర్వహిస్తోన్న రెమిడియల్‌ క్లాసులను మంగళవారం కలెక్టర్‌ వెట్రిసెల్వి ఆకస్మిక తనిఖీ చేశారు. హాజరు తక్కువగా ఉండడంతో విద్యార్థుల తల్లిదండ్రులకు నేరుగా ఫోన్‌ చేసి కారణాలు తెలుసుకున్నారు. తరగతులకు పంపించాలని సూచించారు. నగరంలోని గాంధీనగర్‌ మున్సిపల్‌ హైస్కూలులో టెన్త్‌ తరగతులను, కోటదిబ్బ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ తరగతులను పరిశీలించి అధికారులు, టీచర్లను ప్రశ్నించారు. టెన్త్‌ పరీక్షల్లో 3654 మంది, ఇంటర్‌ పరీక్షల్లో 6256 మంది విద్యార్థులు ఫెయిలయ్యారని, వారంతా కచ్చితంగా రెమిడియల్‌ క్లాసులకు హాజరయ్యేలా చూడా ల్సిన బాధ్యత సంబంధిత సబ్జెక్టు టీచర్లు, హెచ్‌ఎం, ప్రిన్సి పాల్‌ తీసుకోవాలన్నారు. రోజుకొక సబ్జెక్టు చొప్పున రెమిడియల్‌ క్లాసులు కాకుండా, నిత్యం అన్ని సబ్జెక్టులు కవరయ్యేలా క్లాసులు నిర్వహించాలని ఆదేశించారు. కలెక్టర్‌ వెంట డీఈవో వెంకటలక్ష్మమ్మ, ఆర్‌ఐవో యోహాన్‌, డీఐఈవో శేఖర్‌బాబు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 13 , 2026 | 12:22 AM