గ్రామ కంఠం భూముల రిజిస్ట్రేషన్
ABN , Publish Date - Jun 02 , 2026 | 12:47 AM
తాడేపల్లిగూడెం మండలం కొండ్రుప్రోలు కు చెందిన సుబ్బాయమ్మ తన ఆరోగ్య సమస్య కోసం తనకు ఉన్న రెండు సెంట్ల భూమిని విక్రయించాలనుకుంది.
ఆస్తి, ఇంటి పన్ను రసీదు ఉండే చాలు
గ్రామ కంఠం భూముల రిజిస్ట్రేషన్
మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అక్రమాలకు చెక్
వేలాది మంది పేదలకు ప్రయోజనం
(తాడేపల్లిగూడెం రూరల్ –ఆంధ్రజ్యోతి)
తాడేపల్లిగూడెం మండలం కొండ్రుప్రోలు కు చెందిన సుబ్బాయమ్మ తన ఆరోగ్య సమస్య కోసం తనకు ఉన్న రెండు సెంట్ల భూమిని విక్రయించాలనుకుంది. రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళితే అది గ్రామకంఠం అని తహసీల్దార్ ధ్రువీకరణ పత్రం లేదు. స్టాంప్ డ్యూటీకి రూ.10 వేలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పగా చేసేది లేక ఆ ఫీజు చెల్లించి విక్రయించాల్సి వచ్చింది.
ఇది ఒక సుబ్బాయమ్మ సమస్యే కాదు. జిల్లాలో వేలాది మందికి ఇదే పరిస్థితి. చాలా మంది భూములు, ఇంటి స్థలాలు నివాస ప్రాంతాలు గ్రామ కంఠంలో ఉండిపోయాయి. అటువంటి వాటికి రిజిస్ట్రేషన్‌లు జరగడం లేదు. ఒక వేళ చేయాలంటే తహసీల్దార్ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి. దీంతో వేలాది మంది తమ స్థలాలను విక్రయించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి వారికి కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గ్రామ కంఠ భూములకు ఎటువంటి ధ్రువీ కరణ పత్రాలు లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. వెబ్ ల్యాండ్ రికా ర్డుల్లో ఒకే సర్వే నెంబర్ గ్రామకంఠంగా నమోదైతే అది నిషేధిత జాబితాలో ఉన్నా.. లేకపోయినా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. ఆ భూములకు సంబం ధించి ఆస్తి పన్ను రసీదు ఖాళీ పన్ను రసీ దులతో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తి, ఖాళీ స్థలానికి పన్ను రసీదు లేకుంటే క్రయ విక్రయదారుడు సెల్ఫ్ డిక్లరేషన్‌తో రిజిస్ట్రేషన్‌కు అవకాశమిచ్చింది. దీంతో జిల్లాలో వేలాది మందికి ప్రయోజనం కలగనుంది.
ఇక ఇబ్బందులు ఉండకపోవచ్చు
గ్రామ కంఠం విషయంలో ఇప్పటి వరకూ ఉన్న నిబంధనలతో సబ్ రిజిస్ట్రార్ కార్యాల యాల్లో దోపిడీ జరుగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. రకరకాల కొర్రీలు పెడుతూ గ్రామ కంఠం భూములు, స్థలాలను రిజిస్ట్రేషన్ చేసేవారు కాదు. ఒక వేళ రిజిస్ట్రేషన్ చేయా లంటే అదనంగా చెల్లించాల్సి వచ్చేది. డాక్యు మెంట్ రైటర్‌లను అడ్డం పెట్టుకుని చేతి వాటం ప్రదర్శించేవారన్న ఆరోపణలు ఉన్నా యి. ఇంటి అవసరాల కోసం గ్రామకంఠం భూములను విక్రయించుకోవాలనుకునే వారికి చుక్కలు కనిపించేవి. సబ్ రిజిస్ట్రార్ కార్యాల యం వద్ద దళారులు మాటు వేసి మరీ వసూళ్ల పర్వానికి తెరలేపేవారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం గ్రామ కంఠ భూములపై తీసుకున్న నిర్ణయం వల్ల ఇక ఇబ్బందులు ఉండవు.
ఈ నిర్ణయం చాలా మందికి ఉపయోగపకరం
– అడపా శ్రీను, ఆరుగొలను
గ్రామ కంఠ భూముల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంతో ఆనందాన్నిచ్చింది. ఈ నిర్ణయం వల్ల గ్రామాల్లో రిజిస్ట్రేషన్ చేయడానికి వీలులేని భూముల క్రయ విక్రయాలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందరో పేదలకు భూముల రిజిస్ట్రేసన్ కోసం అవకాశం ఇచ్చినట్టయింది.