Share News

ప్రమాదభరితంగా దువ్వ రెగ్యులేటర్‌

ABN , Publish Date - Mar 10 , 2026 | 12:20 AM

దువ్వ గ్రామంలో ఎర్రకాలువ వరద ప్రవాహాన్ని నియంత్రించేందుకు స్వాతంత్ర్యానికి పూర్వం నిర్మించిన రెగ్యులేటర్‌ శిథిలావస్థకు చేరింది.

ప్రమాదభరితంగా దువ్వ రెగ్యులేటర్‌

తణుకు రూరల్‌, మార్చి 9(ఆంధ్రజ్యోతి): దువ్వ గ్రామంలో ఎర్రకాలువ వరద ప్రవాహాన్ని నియంత్రించేందుకు స్వాతంత్ర్యానికి పూర్వం నిర్మించిన రెగ్యులేటర్‌ శిథిలావస్థకు చేరింది. వర్షాకాలంలో జిల్లాలోని ఎగువ ప్రాంతాలలో కురిసే భారీ వర్షాలకు వరదలు ఎర్రకాలువలోకి వస్తాయి. దువ్వ వద్ద ఎర్రకాలువ రెగ్యులేటర్‌ నుంచి వరద నీరు యనమదుర్రు డ్రెయిన్‌లోకి చేరి అక్కడ నుంచి సముద్రంలో కలుస్తుంది. ఇక్కడ రెగ్యులేటర్‌ ద్వారా నీటికి పంట కాలువలకు మళ్లించడం జరుగుతుంది. ఎర్రకాలువ వరద నీటిని నియంత్రించేందుకు 1930లో అప్పటి ప్రభుత్వ దువ్వ రెగ్యులేటర్‌తో పాటు వంతెనను ఏర్పాటు చేశారు. కాలక్రమంలో వంతెన పక్కనే కొత్తగా వంతెనలు నిర్మించి వాహనాల రాకపోకలు మళ్లించారు. రెగ్యులేటర్‌ కోసం వంతెన ఉన్నప్పటికీ శిథిలాస్థకు చేరుకుంది. అప్పట్లో వరద ప్రవాహం తక్కువగా ఉండడంతో ఇప్పటివరకూ పని చేసిందని, ఇటీవల వరద ప్రవాహం పెరిగి రెగ్యులేటర్‌ కొట్టుకుపోయే ప్రమాదం ఉందని ఇంజనీరింగ్‌ అధికారులు చెబుతున్నారు. ఎప్పటికప్పుడు అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి పంపిస్తున్నా నిధులు మంజూరు కాకపోవడంతో పనులు చేపట్టలేకపోతున్నారని గ్రామస్థులు పేర్కొంటున్నారు.

Updated Date - Mar 10 , 2026 | 12:20 AM