Share News

రిజిస్ర్టేషన్ల జోష్‌!

ABN , Publish Date - Jan 31 , 2026 | 12:42 AM

భూముల క్రయ, విక్రయాలకు సంబంధిం చి రిజిస్ర్టేషన్లు గురు, శుక్రవారాల్లో ఊపందు కున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి భూములు మార్కెట్‌ విలువలు పెరగనున్న నేపథ్యంలో కక్షిదారులు ముందు చూపుతో వ్యవహరిం చారు.

రిజిస్ర్టేషన్ల జోష్‌!
ముదినేపల్లి సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయం వద్ద శుక్రవారం కక్షిదారుల రద్దీ

మార్కెట్‌ విలువల భారంతో అప్రమత్తం

గురు, శుక్రవారాల్లో 400కు పైగా రిజిస్ర్టేషన్లు

ఇప్పటికే రూ.337 కోట్లకు రూ.300 కోట్లు వసూలు

89.02 శాతం చేరిన లక్ష్యం

1 నుంచి కొత్త విలువలు అమలు

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

భూముల క్రయ, విక్రయాలకు సంబంధిం చి రిజిస్ర్టేషన్లు గురు, శుక్రవారాల్లో ఊపందు కున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి భూములు మార్కెట్‌ విలువలు పెరగనున్న నేపథ్యంలో కక్షిదారులు ముందు చూపుతో వ్యవహరిం చారు. దీంతో అన్ని సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాల యాలు కక్షిదారులతో కిటకిటలాడాయి. పండుగ ముందువరకు పెద్దగా రిజిస్ర్టేషన్ల జరగలేదు. భూములు విలువల పెంపుతో రిజి స్ర్టేషన్లకు ఆసక్తి చూపే అవకాశాలు తగ్గుతా యన్న ముందు చూపుతో రోజూవారీ స్లాట్‌ బుకింగ్‌ల కోటాలను ప్రతి సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లోను అధికారులు రెట్టింపును చేపట్టారు. దానికి తగ్గట్టుగా క్రయ,విక్రయ దారులు స్లాట్లను బుక్‌ చేసుకున్నారు. దీంతో రిజిస్ర్టేషన్లు ఊపందుకున్నాయి. జనవరి 30 నాటికి రూ.337 కోట్ల ఆదాయం ఆర్జించాల్సి ఉండ గా, శుక్రవారం నాటికి రూ.300 కోట్లను అధికారులు రాబట్టారు. ఇది నూరుశాతంలో 89.02 శాతంగా ఉంది.

డాక్యుమెంట్లు ఎక్కువే..

మామూలు రోజుల్లో సరాసరిన 200 డాక్యు మెంట్లే రిజిస్ట్రర్‌ అయ్యేవి. భూముల ధరలకు రెక్కలొచ్చే అవకాశాల నేపథ్యంలోనే గురు,శుక్ర వారాల్లో రిజిస్ర్టేషన్లు డాక్యుమెంటే షన్లు పోటాపోటీగానే సాగాయి. 29న ఏలూరు తో పాటు 12 సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో 522 డాక్యుమెంట్లు రిజిస్ర్టేషన్లు చేయగా రూ.2కోట్ల 69లక్షల78 వేలు ఆదాయం సమ కూరింది. శుక్రవారం 473 రిజిస్ర్టేషన్ల ద్వారా రూ.2కోట్ల 87లక్షల ఆదాయం స్టాంప్స్‌అండ్‌ రిజిస్ర్టేషన్ల శాఖ ఆర్జించింది.

ముగిసిన అభ్యంతరాలు..

జిల్లాలో భూముల మార్కెట్‌ విలువలపై అభ్యంతరాలు ఈసారి భారీగానే సబ్‌ రిజి స్ర్టార్లకు అందాయి. ప్రభుత్వం విధించిన గడు వు అభ్యంతరాల స్వీకరణ గడువు నెల 29న ముగిసింది. జిల్లా కమిటీ శుక్రవారం వీటిని పరిశీలించింది. ఏలూరు ఎస్‌ఆర్‌వో పరిధిలో 11 అభ్యంతరాలు, సూచనలు రాగా 10 ఆమో దించగా, ఒకటి తిరస్కరించారు. జంగారెడ్డి గూడెంలో 3, కైకలూరులో 2, వట్లూరులో 1 పరిగణనలోకి తీసుకున్నారు. గణపవరం పరి ధిలో ఒక అభ్యంతరం, సూచన రాలేదు. అయితే కొన్నింటిని మాత్రమే తిరస్కరించారు. ఏలూరులో పరిధిలో 10 శాతం, జంగారెడ్డిగూడెంలో 15–20 శాతం. నూజివీడులో 20 శాతం లోపు మార్కెట్‌ విలువలు పెంపుదల అమలులోకి రానుంది. సబ్‌ రిజిస్ర్టార్ల వారీగా వచ్చిన సూచనలు, సలహాలను జిల్లా జాయిం ట్‌ కలెక్టర్‌ ఎంజే అభిషేక్‌ గౌడ ముందు సబ్‌ రిజిస్ర్టార్లు ఉంచారు. జిల్లా స్థాయి కమిటీ అన్ని పరిశీలించి స్వల్ప మార్పులతో మార్కెట్‌ విలువలను ఆమోదించినట్టు జిల్లా రిజిస్ర్టార్‌ శ్రీనివాసరావు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. పెంచిన మార్కెట్‌ విలువలు ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి వస్తాయన్నారు. ఆరోజు ఆదివారం అయినప్పటికి ఎవరైనా రిజిస్టర్‌ చేయించుకో వాలంటే రూ.5వేలు చెల్లించి ముందుగా స్లాట్‌ బుక్‌ చేసుకుంటే.. సెలవు రోజుల్లోను రిజిస్ర్టేషన్లు చేస్తామన్నారు.

Updated Date - Jan 31 , 2026 | 12:42 AM